టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు: 15 మంది మృతి, అగ్నికీలల్లో 50 మంది

Published : Sep 04, 2019, 06:11 PM ISTUpdated : Sep 04, 2019, 06:19 PM IST
టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు: 15 మంది మృతి, అగ్నికీలల్లో 50 మంది

సారాంశం

పంజాబ్ రాష్ట్రంలోని ఓ టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 15 మంది మృత్యువాత పడ్డారు. 

పంజాబ్: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్ టపాసుల ఫ్యాక్టరీలో బుధవారం నాడు చోటు చేసుకొన్న పేలుడులో 15 మంది మృతి చెందారు. సుమారు 50 మంది మంటల్లో చిక్కుకొన్నారు. ఘటన స్థలంలో ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.

బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొందని  ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఫ్యాక్టరీ నివాస ప్రాంతాల మధ్య ఉందని బోర్డర్ రేంజ్ ఐజీ పర్మార్ తెలిపారు.

ఈ విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు.  సహాయక చర్యలను చేపట్టారు. పేలుడు సంబవించిన సమయంలో తొమ్మిది మంది మృతి చెందారు. పేలుడు కారణంగా ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. ఫ్యాక్టరీలో ఉన్న సుమారు 50మందికిపైగా ఈ మంటల్లో చిక్కుకొన్నారు. వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?