హెచ్ఐవీ సోకిందని ఉద్యోగం లో నుంచి తీసేసారు..

By ramya neerukondaFirst Published Dec 4, 2018, 2:15 PM IST
Highlights

‘‘నాకు హెచ్‌ఐవీ నా భర్త నుంచి సంక్రమించింది. వైద్య ప్రయోజనాల కోసం ఈ పత్రాలను మా సంస్థకు చూపించగా.. కేవలం 30 నిమిషాల్లో వాళ్లు నన్ను రాజీనామా చేయాలని బలవంతపెట్టారు. నేను అక్కడ ఐదేళ్లుగా పనిచేస్తున్నాను.’’ అని బాధితురాలు  కోర్టులో వెల్లడించారు. 

హెచ్ఐవీ సోకిందని ఓ మహిళను ఉద్యోగం నుంచి తీసేసారు. కాగా... మూడేళ్ల తర్వాత ఆ మహిళకు న్యాయస్థానం న్యాయం జరిగేలా చూసింది. ఈ సంఘటన పూణేలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..2015లో పుణెకు చెందిన ఓ మహిళకు హెచ్‌ఐవీ  సోకినట్లు తెలిసింది. కాగా ఆమె  తాను పనిచేస్తున్న సంస్థ నుంచి మెడికల్ ఇన్సూరెన్స్ తదితర అవసరాల కోసం  తన మెడికల్‌ డాక్యుమెంట్లను యాజమాన్యం ముందుంచింది.  కాగా..వాటి ద్వారా ఆమెకు హెచ్ఐవీ ఉన్నట్లు గుర్తించిన కంపెనీ యాజమాన్యం అదే రోజు మహిళను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించింది. ఆమె ఎంతో నచ్చచెప్పాలని ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. 

అయితే.. ఈ విషంయలో ఆమె కోర్టును ఆశ్రయించింది. మూడు సంవత్సరాల పాటు వాదోపవాదనలు సాగిన అనంతరం తాజాగా.. ఆమెకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. వెంటనే ఆమెను ఉద్యోగం తీసుకోవాలని కంపెనీని ఆదేశించింది. అంతేకాకుండా ఆమెను తొలగించిన ఈ మూడు సంవత్సరాల కాలానికి జీతం కూడా ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. 

‘‘నాకు హెచ్‌ఐవీ నా భర్త నుంచి సంక్రమించింది. వైద్య ప్రయోజనాల కోసం ఈ పత్రాలను మా సంస్థకు చూపించగా.. కేవలం 30 నిమిషాల్లో వాళ్లు నన్ను రాజీనామా చేయాలని బలవంతపెట్టారు. నేను అక్కడ ఐదేళ్లుగా పనిచేస్తున్నాను.’’ అని బాధితురాలు  కోర్టులో వెల్లడించారు. మరోవైపు మహిళ తనంత తానుగా ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయిందని సదరు సంస్థ కోర్టుకు వెల్లడించినట్లు బాధితురాలి తరపు న్యాయవాది తెలిపారు. ఎట్టకేలకు ఆమెకు న్యాయం జరగడంపట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. 

click me!