మనుషుల్ని చంపడం ఇష్టం: సైకో కిల్లర్ మాటలతో పోలీసుల షాక్

Published : Jun 14, 2020, 04:40 PM IST
మనుషుల్ని చంపడం ఇష్టం: సైకో కిల్లర్ మాటలతో పోలీసుల షాక్

సారాంశం

వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సైకో కిల్లర్ స్వంత అన్నను హత్య చేసేందుకు పోలీసులకు దొరికిపోయాడు.  హత్యలు చేయడమంటే తనకు అత్యంత ఇష్టమని నిందితుడు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు.


లక్నో: వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సైకో కిల్లర్ స్వంత అన్నను హత్య చేసేందుకు పోలీసులకు దొరికిపోయాడు.  హత్యలు చేయడమంటే తనకు అత్యంత ఇష్టమని నిందితుడు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఈటా జిల్లా ధర్మాపూర్ గ్రామానికి చెందిన సత్యేంద్ర అనే ఆరేళ్ల బాలుడు ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుమానాస్పదస్థితిలో మరణించాడు. జూన్ 9వ తేదీన అతని సోదరుడు ప్రశాంత్ కూడ అదే రకంగా మరణించాడు. జూన్ 11వ తేదీన సత్యేంద్ర, ప్రశాంత్ ల చిన్నాన్న రాథేశ్యామ్. 

రాథేశ్యామ్ తన స్వంత సోదరుడు విశ్వనాథ్ సింగ్ నిద్రపోతున్న సమయంలో కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన బంధువులు శ్యామ్ ను పట్టుకొన్నారు. వెంటనే అతడిని పోలీసులకు అప్పగించారు. 

సత్యేంద్ర, ప్రశాంత్ లను కూడ తానే చంపానని రాథేశ్యామ్ పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడు. మనుషుల్ని చంపడమంటే తనకు ఇష్టమని ఆయన విచారణలో పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు.

మరో ముగ్గురిని కూడ చంపేందుకు నిందితుడు ప్లాన్ చేసుకొన్నాడని సక్రూలి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు.  చిన్నారుల హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు చిన్నారులను హత్య చేసినట్టుగా రాథేశ్యామ్ ఒప్పుకోవడంతో గతంలో అరెస్ట్ చేసిన వారిపై కేసును ఉప సంహరించుకొనేందుకు పోలీసులు రంగం సిద్దం చేశారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu