PSLV-C53 mission: మరోసారి సత్తా చాటిన ఇస్రో.. నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 53

By Siva KodatiFirst Published Jun 30, 2022, 6:27 PM IST
Highlights

సింగపూర్ కు చెందిన మూడు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ 35 రాకెట్ ద్వారా ఇస్రో విజయవంతంగా నింగిలోకి చేర్చింది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలో వున్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో ) మరోసారి తన సత్తా చాటింది. పీఎస్ఎల్వీ  సీ 53 రాకెట్ ద్వారా గురువారం నాడు సింగపూర్ కు చెందిన మూడు ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి చేర్చింది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలో వున్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది పీఎస్ఎల్వీ సీ 53. 

 PSLV-C53 అనేది న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ రెండవ వాణిజ్య మిషన్.  ఇది PSLV కేట‌గిరీలో 55వ మిషన్ మరియు PSLV-కోర్ అలోన్ వేరియంట్‌ని ఉపయోగించే 15వ మిషన్ అని ఇస్రో వ‌ర్గాలు పేర్కొన్నాయి. కొత్తగా అభివృద్ధి చేసిన సాంకేతిక‌త డెవలప్‌మెంట్‌లో.. లాంచ్ వెహికల్ విడిపోయిన తర్వాత సైంటిఫిక్ పేలోడ్‌ల కోసం ఒక ప్లాట్‌ఫారమ్‌గా ఉపయోగించేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తోందని అధికారులు తెలిపారు.

వ్యోమనౌక దాని లాంచ్ ఫెయిరింగ్ DS-EO ఉపగ్రహంలో మూడు ఉపగ్రహాలను తీసుకు వెళ్ల‌నుంది. SAR పేలోడ్‌ను మోసుకెళ్లే సింగపూర్ కు చెందిన మొట్టమొదటి చిన్న వాణిజ్య ఉపగ్రహం NeuSAR.  ఇది పగలు మరియు రాత్రి తో పాటు అన్ని వాతావరణ పరిస్థితులలో త‌న కార్య‌కాల‌పాలను కొన‌సాగిస్తూ.. చిత్రాలను అందిస్తుంది. PSLV-C53 228.433 టన్నుల లిఫ్ట్-ఆఫ్ ద్రవ్యరాశిని క‌లిగివుంద‌ని ఇస్రో వ‌ర్గాలు తెలిపాయి. దాదాపు 44.4 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రయోగ వాహనం DS-EO ఉపగ్రహాన్ని భూమధ్యరేఖ నుండి 570 కి.మీ ఎత్తులో ఉన్న కక్ష్యలోకి  ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. 

click me!