భార్యను చంపాలని భర్త సుపారీ.. పిల్లల్ని చూసి కరిగిపోయిన కిల్లర్

By sivanagaprasad kodatiFirst Published Sep 28, 2018, 8:53 AM IST
Highlights

నరహంతకులకు కూడా మానవత్వం, మనసు ఉంటుందని మరోసారి రుజువైంది. ప్రియురాలిని పెళ్లాడేందుకు అడ్డుగా ఉందని భార్యను చంపాల్సిందిగా ఓ హెడ్‌కానిస్టేబుల్ కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చాడు. 

నరహంతకులకు కూడా మానవత్వం, మనసు ఉంటుందని మరోసారి రుజువైంది. ప్రియురాలిని పెళ్లాడేందుకు అడ్డుగా ఉందని భార్యను చంపాల్సిందిగా ఓ హెడ్‌కానిస్టేబుల్ కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చాడు. అయితే భార్యను చంపితే పిల్లలు అనాథలు అవుతారని ముఠా నాయకుడికి జాలి కలిగింది.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక శివమొగ్గ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే హెడ్‌కానిస్టేబుల్ రవీంద్రగిరికి తొమ్మిదేళ్ల క్రితం దావణగెరెకు చెందిన అనితతో వివాహమైంది. వీరికి 8 ఏళ్ల కుమారుడు, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. అయితే రవీంద్రకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది.

ఆమెను పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ భార్య అడ్డుగా ఉండటంతో ఆమెను చంపాలని భావించాడు. తన భార్య అనితను చంపాల్సిందిగా కిరాయి కిల్లర్ ఫిరోజ్‌తో ఒప్పందం కుదుర్చుకుని రూ.4 లక్షలు ఇచ్చాడు.

పథకంలో భాగంగా ఫిరోజ్ తన అనుచరులు సయ్యద్ ఇర్ఫాన్, సుహైల్‌లతో కలిసి అనితను చంపేందుకు మూడుసార్లు ప్రయత్నంచి విఫలమయ్యాడు. ఇలా పదే పదే ఎందుకు జరుగుతుందని ఆలోచించగా... ఆమెను చంపితే పిల్లలు అనాథలు అవుతారనే తాను అనితను చంపలేకపోతున్నానని ఫిరోజ్ భావించాడు.

దీంతో ఆ ఒప్పందాన్ని పక్కనబెట్టేశాడు. అయితే మరో కేసులో అరెస్టైన ఫిరోజ్ వద్ద అనిత ఫోటో చూసి తీగ లాగితే డొంకంతా కదిలింది.. దీంతో పోలీసులు ఫిరోజ్, ఇర్ఫాన్, సుహైల్, కానిస్టేబుల్ రవీంద్రలపై కేసు నమోదు చేశారు.
 

click me!