పీఎం కేర్స్ ఫండ్ పై ప్ర‌ధాని ఫొటో,పేరు జాతీయ జెండా ఉప‌యోగాన్ని స‌మ‌ర్థించుకున్న పీఎంవో..

By team teluguFirst Published Jan 19, 2022, 10:29 AM IST
Highlights

పీఎం కేర్స్ ఫండ్ వెబ్ సైట్ లో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ ఫొటో, పేరు, త్రివ‌ర్ణ ప‌తాకం చిహ్నం ఉప‌యోగించ‌డాన్ని పీఎంవో స‌మ‌ర్థించింది. పీఎం కేర్స్ ఫండ్‌కు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో దాఖలైన  పిటిషన్‌పై మంగళవారం ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం స్పందించింది.
 

పీఎం కేర్స్ ఫండ్ (pm cares fund) వెబ్ సైట్ లో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ (prime minister narendra modi)  ఫొటో, పేరు, త్రివ‌ర్ణ ప‌తాకం చిహ్నం ఉప‌యోగించ‌డాన్ని పీఎంవో (pmo) స‌మ‌ర్థించింది. పీఎం కేర్స్ ఫండ్‌కు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో దాఖలైన  పిటిషన్‌పై మంగళవారం ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం స్పందించింది. వీటి వినియోగంపై ఎలాంటి ప‌రిమితి లేద‌ని పేర్కొంది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF)లో కూడా  ప్రధానమంత్రి ఫోటో, పేరు,  జాతీయ చిహ్నాన్ని కూడా ఉపయోగించినట్లు  ధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎంస్ కార్నిక్ డివిజన్ బెంచ్ ఎదుట స‌మ‌ర్పించిన అఫిడవిట్‌లో పీఎంవో అండర్ సెక్రటరీ ప్రదీప్ శ్రీవాస్తవ తెలిపారు.

పీఎం కేర్స్ ఫండ్ నుంచి, అధికారిక వెబ్ సైట్స్ నుంచి  ప్ర‌ధానమంత్రి ఫొటో, పేరు తొల‌గించాల‌ని, అలాగే జాతీయ జెండా అయిన త్రివ‌ర్ణ ప‌తాకం చిహ్నాన్ని తీసివేయాల‌ని కోరుతూ కాంగ్రెస్ కార్యకర్త విక్రాంత్ చవాన్ (vikranth chawan) పిటిష‌న్  దాఖ‌లు చేశారు. ప్ర‌ధాని ఫొటో, త్రివ‌ర్ణ ప‌తాకం ఉప‌యోగించ‌డాన్ని రాజ్యాంగాన్ని, అలాగే ఎంబ్లెమ్స్ అండ్ నేమ్స్ (అక్రమ వినియోగం నిరోధక) యాక్ట్ ను ఉల్లంఘించడమేనని అవుతుంద‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. 

పీఎం కేర్స్ ఫండ్, పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ (pmnrf) రెండింటికి కూడా ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాయని పీఎంవో తెలిపింది. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ కోసం ప్రధానమంత్రి ఫొటో, జాతీయ చిహ్నం ఉపయోగిస్తున్నామ‌ని తెలిపింది. అలాగే పీఎం కేర్స్ ఫండ్ కోసం వాటిని ఉప‌యోగిస్తున్నామ‌ని పేర్కొంది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా - 2002 (flog code of india - 2002), జాతీయ జెండా ప్రదర్శనకు సంబంధించిన అన్ని చట్టాలు, సమావేశాలు, పద్ధతులు, సూచ‌న‌ల సారాంశం, ఎంబ్లెమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ లో (emblems and names act) మేర‌కు సాధార‌ణ ప్ర‌జ‌లు, ​​ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు ఎవ‌రైనా జాతీయ చిహ్నాలు వాడుకోవ‌చ్చ‌ని, వాటి కోసం ఎలాంటి ఆంక్ష‌లు ఉండ‌వ‌ని పీఎంవో త‌న అఫిడవిట్‌లో పేర్కొంది. 

పీఎం దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ ప్ర‌కారం.. పీఎం కేర్స్ ఫండ్ కు ప్రధానమంత్రి (ఎక్స్-అఫీషియో) చైర్మ‌న్ గా ఉంటార‌ని, డిఫెన్స్ మినిస్ట‌ర్, హోం అఫైర్స్ మినిస్ట‌ర్, ఫైనాన్స్ మినిస్ట‌ర్ ఎక్స్-అఫిషియో ట్రస్టీలుగా ఉంటారు. “పీఎం కేర్స్ ఫండ్ పబ్లిక్ ఆఫీస్ ఎక్స్-అఫీషియో హోల్డర్లతో కూడిన ట్రస్టీల బోర్డ్ స‌భ్యులు, కేవలం పరిపాలనా సౌలభ్యం,  ట్రస్టీషిప్‌కు సాఫీగా కొనసాగడం కోసం మాత్ర‌మే ఉంటార‌ని పీఎంవో తెలిపింది. 

కరోనా విజృంభిస్తున్న స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్ ఫండ్స్ పేరుతో ఓ ట్ర‌స్టీని ఏర్పాటు చేసింది. ఈ ఫండ్ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో దేశ పౌరుల కోసం ఉప‌యోగిస్తారు. దీనికి వ‌చ్చే విరాళాలు భార‌త ఏకీకృత నిధికి (consolidated fund of india)కి వెళ్ల‌వు. వివిధ ట్ర‌స్ట్ ల మాదిరిగానే సేవా కార్యాక్ర‌మాలు నిర్వ‌హిస్తుంది. ఈ విష‌యంలో పీఎంవో గ‌తంలోనే క్లారిటీ ఇచ్చింది. గ‌తేడాదిలో కూడా పీఎం కేర్ ఫండ్స్ ను ప్ర‌భుత్వ నిధిగా ప్ర‌క‌టించాల‌ని కోరుతూ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైన విష‌యం తెలిసిందే. 

click me!