PM Modi birthday: బిజీ షెడ్యూల్ మధ్య ఈ వారంలోనే 72వ బర్త్ డే జరుపుకోనున్న ప్రధాని మోడీ

By Mahesh RajamoniFirst Published Sep 15, 2022, 1:15 PM IST
Highlights

PM Modi birthday: ఈ ఏడాది ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తన పుట్టినరోజున మధ్యప్రదేశ్‌లో ఉండ‌నున్నారు. అక్క‌డ ఆయ‌న నమీబియా నుంచి తీసుకువ‌చ్చిన ఎనిమిది చిరుత‌ల‌ను కునో నేషనల్ పార్క్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. కాగా, ఈ wild cats 1950లలో దేశంలో అంతరించిపోయినట్లు ఇదివ‌ర‌కు ప్ర‌క‌టించారు.
 

Prime Minister Narendra Modi: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈ వారంలోనే త‌న 72 వ పుట్టిన రోజును జ‌రుపుకోనున్నారు. ప్ర‌తి యేడాది ప్ర‌ధాని త‌న పుట్టిన రోజున అనేక కార్య‌క్ర‌మాల‌తో బిజీబిజీగా గ‌డుపుతూ పుట్టిన రోజు వేడుక‌ల‌ను జ‌రుపుకుంటున్నారు. త‌న పుట్టిన రోజైన సెప్టెంబ‌ర్ 17న ప్ర‌ధాని మోడీ త‌న పుట్టిన రోజున త‌న త‌ల్లిని క‌లిసి.. ఆమె ఆశీర్వాదాలు తీసుకునీ, ప‌లు ప్రాజెక్టుల‌ను ప్రారంభించ‌డంతో బిజీబిజీగా ఉండ‌నున్నారు. ఈ ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతపులిలను మధ్యప్రదేశ్‌లోని గుణ నేషనల్ పార్క్‌లోకి ప్రధాని మోడీ విడిచి పెట్ట‌నున్నారు. కాగా, ఈ చిరుతపులులు దేశంలో అంతరించిపోయినట్లు 1950లలో ప్రకటించారు.

మరోవైపు, ప్ర‌ధాని మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా “సేవ పక్వాడా” కార్యక్రమం కింద వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు బీజేపీ ప్రకటించింది. సెప్టెంబరు 17, 1950న ఉత్తర గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని వాద్‌నగర్ అనే చిన్న పట్టణంలో జన్మించిన మోడీ.. ఈ వారం త‌న 72వ పుట్టిన‌రోజును జ‌రుపుకోనున్నారు.

2014లో భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పటి నుండి మోడీ  తన పుట్టినరోజును ఎలా జరుపుకున్నార‌నే వివ‌రాలు మీకోసం.. 

2014

అప్ప‌టివ‌ర‌కు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న న‌రేంద్ర‌మోడీ.. 2014లో ప్ర‌ధాని అయ్యారు. ఆ ఏడాది త‌న  పుట్టిన రోజు సందర్భంగా ఆయ‌న తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించి గాంధీనగర్‌లో తన తల్లి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే, హ్మదాబాద్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు స్వాగతం పలికిన ప్రధాని, సబర్మతీ ఆశ్రమం, సబర్మతీ నది ఒడ్డును ఆయనకు చూపించారు.

2015

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తన 65వ పుట్టినరోజు సందర్భంగా 1965 భారత్-పాకిస్థాన్ యుద్ధానికి స్వర్ణ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఆరు రోజుల పాటు నిర్వహించే సైనిక ప్రదర్శన 'చౌరియాంజలి'ని సందర్శించారు.

2016

తన 66వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ, త‌న స్వరాష్ట్రం గుజ‌రాత్ లో పర్యటించి గాంధీనగర్‌లో ఉన్న తన తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం నవ్యాంధ్రకు వెళ్లి వికలాంగులకు సహాయసహకారాలు అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు.

2017

ప్రధాని మోడీ తన 67వ పుట్టినరోజు సందర్భంగా గాంధీనగర్‌లో తన తల్లి ఆశీస్సులు పొంది రోజును ప్రారంభించారు. అనంతరం కవాడియా వద్ద ఉన్న సర్దార్ సరోవర్ డ్యామ్‌ను జాతికి అంకితం చేశారు.

2018

ప్రధాని మోడీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పాఠశాల విద్యార్థులతో కలిసి తన 68వ పుట్టినరోజును జరుపుకున్నారు. అలాగే పాఠశాల విద్యార్థులకు సోలార్ ల్యాంప్, స్టేషనరీ, స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్ వంటి బహుమతులను అందజేశారు. తన 68వ పుట్టినరోజును విద్యార్థులతో గడిపిన ప్రధాని కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రార్థనలు చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు అక్కడికి వెళ్లారు.

2019

ప్రధాని మోడీ తన 69వ పుట్టినరోజు సందర్భంగా గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ సరోవర్ డ్యామ్‌లను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

2020

క‌రోనా వైర‌స్‌తో దేశం పోరాడుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ పుట్టిన రోజు వేడుక‌లు అట్టహాసంగా జరిగాయి. గత ఏడాది మాదిరిగానే ప్రధాని మోదీ జన్మదినాన్ని ‘సేవా దివస్‌’గా జరుపుకునేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించింది.

2021

2021లో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ 21వ సమావేశంలో..వ‌ర్చువ‌ల్ గా ఆఫ్ఘనిస్తాన్‌పై SCO-CSTO ఔట్‌రీచ్ సెషన్‌లో ప్రధాని మోడీ పాల్గొన్నారు.

click me!