Chennai: దుష్టశక్తుల పేరుతో.. మైనర్ బాలికపై ఆలయ పూజారి లైంగిక దాడి.. అంత‌లోనే అక్క‌డి నుండి ప‌రార్ 

Published : Aug 06, 2022, 04:01 PM IST
Chennai: దుష్టశక్తుల పేరుతో.. మైనర్ బాలికపై ఆలయ పూజారి లైంగిక దాడి..  అంత‌లోనే అక్క‌డి నుండి  ప‌రార్ 

సారాంశం

Chennai: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన 55 ఏళ్ల ఆలయ పూజారిపై బాధితురాలి త‌ల్లిదండ్రులు దాడి చేయ‌డంతో ఆ నిందితుడు అక్క‌డి నుంచి పరార్ అయ్యారు. నిందితుడిని తమిళనాడులోని చెన్నై మధురవాయల్‌లోని గంగాయమ్మన్ ఆలయంలో పూజారి చంద్రశేఖర్ (55)గా గుర్తించారు.

Chennai: చిన్నారులు, మహిళల రక్షణ కోసం ప్ర‌భుత్వాలు ఎన్నో చట్టాలను అమలు చేస్తున్న.. కామాంధుల ఆగ‌డాలకు అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోతున్నాం. పసికందుల నుంచి పండు ముస‌లి వాళ్ల దాకా.. లైంగిక దాడుల‌కు గుర‌వుతున్నారు. కామాంధుల లైంగిక దాహాన్ని బ‌ల‌వుతున్నారు. నిర్భయ, దిశ లాంటి ఎన్నో చట్టాలు అమ‌ల్లో ఉన్నా.. మృగళ ప్ర‌వ‌ర్త‌న‌లో ఎటువంటి మార్పు రాలేదు.  తాజాగా.. నిత్యం దైవారాధనలో ఉండే..  ఓ ఆల‌య‌ పూజారి కీచకుడుగా మారాడు. దుష్టశక్తులను పారద్రోలేందుకు పూజలు చేస్తున్నారనే నెపంతో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డాడు. తమిళనాడులోని చెన్నైలోని మధురవాయల్‌లో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. నిందితుడు చంద్రశేఖర్.. తమిళనాడులోని చెన్నైలోని మధురవాయల్ సమీపంలోని గంగాయమ్మన్ ఆలయంలో గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా పూజారిగా ప‌నిచేస్తున్నారు. ఈ నిందితుడు రెండు వేర్వేరు సందర్భాలలో మైనర్లను వేధించాడని ఆరోపణలు వచ్చాయి. 

2018లో.. ఓ మైన‌ర్ బాలిక‌పై క‌న్నేశాడు. దుష్టశక్తులను పారద్రోలేందుకు పూజలు చేస్తున్నారనే నెపంతో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2018లో ఓ బాలిక 11వ తరగతి చదువుతున్నది. ఎలాగైనా  ఆ బాలికను అనుభ‌వించాల‌ని భావించిన ఆ కామాంధ పూజారి.. ఆ బాలిక‌ తల్లిదండ్రులను సంప్రదించారు. ఆ అమ్మాయిలో దుష్టశక్తులు ఉన్నాయని, దీంతో ఆమె పెళ్లి ఆలస్యమవుతుందని  మాయ‌ మాటలు చెప్పాడు. ఆ అమ్మాయిలో ఉన్న దుష్ట‌శ‌క్తుల‌ను, ఆత్మలను దూరం చేయడానికి తాను పూజ చేస్తానని న‌మ్మ‌బ‌లికాడు. ఆ అమ్మాయిని, ఆమె తల్లిని ఆలయ ప్రాంగణంలో 15 రోజులు ఉండనివ్వమని వారికి సలహా ఇచ్చాడు. ఈ త‌రుణంలో ఆ మైన‌ర్ బాలిక‌పై ప‌లు మార్లు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ఈ విష‌యం ఇటీవ‌ల త‌న త‌ల్లిదండ్రుల‌కు వివ‌రించింది. 

ఇటీవలే మ‌రో ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఓ మైన‌ర్ బాలిక ప్రాయశ్చిత్తం కోసం పూజ చేస్తాననే నెపంతో గుడిలో బస చేసిన మరో బాలికపై పూజారి లైంగిక దాడికి పాల్పడ్డాడని వార్త వెలుగులోకి వ‌చ్చింది. ఆమెను ప్రశ్నించగా.. పూజారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని బాలిక ఆవేద‌న వ్య‌క్తం చేసింది.
 
పూజారిపై బాధితురాలు తండ్రి దాడి.. అంత‌లోనే ప‌రార్ 

మైనర్ అయిన తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణతో కోపోద్రిక్తుడైన తండ్రి .. ఆ ఆల‌య‌ పూజారిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అనంత‌రం ఆ పూజారిని  ఆసుపత్రిలో చేరి..పోలీసులకు స‌మాచారం అందించారు. పోలీసులు వ‌చ్చి.. అరెస్టు చేస్తార‌నే లోపే ఆ పూజారి అక్క‌డి నుండి పారిపోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా.. పూజారిపై  పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. ప‌రారీలో ఉన్న ఆల‌య పూజారి కోసం గాలింపు చేప‌డుతున్న‌ట్టు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?