గ్రామాల్లోకి కరోనా.. గతేడాది అడ్డుకోగలిగాం, ఈసారి సవాలే: ప్రధాని మోడీ

By Siva KodatiFirst Published Apr 24, 2021, 7:50 PM IST
Highlights

గతేడాది తొలి దశ మాదిరిగానే కరోనా వైరస్‌ గ్రామాల్లోకి ప్రవేశించకుండా నిరోధించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ‘స్వామిత్వ’ పథకం కింద ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఈ ప్రాపర్టీ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు

గతేడాది తొలి దశ మాదిరిగానే కరోనా వైరస్‌ గ్రామాల్లోకి ప్రవేశించకుండా నిరోధించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ‘స్వామిత్వ’ పథకం కింద ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఈ ప్రాపర్టీ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా 4.09 లక్షల ఆస్తి యజమానులకు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజున దేశం మొత్తం కరోనా వైరస్‌పై పోరాడుతోందని ప్రధాని గుర్తుచేశారు.

ఆ సమయంలో కోవిడ్ గ్రామాలకు చేరుకోకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. తన పిలుపుతో మీరు (ముఖ్యమంత్రులు) కరోనా గ్రామాల్లోకి ప్రవేశించకుండా, అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించారని ప్రధాని కొనియాడారు.

Also Read:మే 2 తర్వాత చివరి అస్త్రం, లాక్ డౌన్ అవకాశం, మోడీ మదిలో ఏముంది..?

ఈ ఏడాది కూడా ఈ మహమ్మారి గ్రామాలకు చేరకుండా చూడాల్సిన సవాల్ మనముందు వుందని మోడీ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలు గ్రామాల్లో అనుసరించేలా చూడాలని ప్రధాని సూచించారు.

అయితే ఈసారి మనకు టీకాల రక్షణ వుంది కాబట్టి.. గ్రామసీమల్లో కూడా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని నరేంద్రమోడీ విజ్ఙప్తి చేశారు. గ్రామాలు ఆర్ధిక స్వావలంబన సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొన్నారు. 

click me!