జమ్మూలో రాష్ట్రపతి పాలన

By narsimha lodeFirst Published Dec 19, 2018, 7:43 PM IST
Highlights

 జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో  రాష్ట్రపతి పాలన విధించారు.బుధవారం రాత్రి నుండి  రాష్ట్రపతి పాలన  అమల్లోకి  రానుంది.ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో  రాష్ట్రపతి పాలన విధించారు.బుధవారం రాత్రి నుండి  రాష్ట్రపతి పాలన  అమల్లోకి  రానుంది.ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో  గవర్నర్ పాలనకు  ఆరు మాసాల కాల వ్యవధి పూర్తి కావడంతో  రాష్ట్రపతి పాలన విధించారు.జమ్మూ కాశ్మీర్ సత్యపాల్ సిఫారసు మేరకు కేంద్ర మంత్రివర్గం జమ్మూలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం రాష్ట్రపతిని కోరింది.

ఈ మేరకు రాష్ట్రపతి కోవింద్ రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయం తీసుకొన్నారు. బీజేపీ పీడీపీకి మద్దతును ఉప సంహరించుకోవడంతో గవర్నర్ పాలన విధించారు.

అయితే పీడీపీ నేషనల్ కాన్పరెన్స్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దం చేసుకొన్న సమయంలో  గవర్నర్ అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కోర్టు ఈ పిటిషన్ ను కొట్టేసింది.

click me!