Presidential Election Result: భారీ ఆధిక్యంలో ద్రౌపది ముర్ము.. ఆమెకు ఎంతమంది ఎంపీలు ఓటేశారంటే..

Published : Jul 21, 2022, 03:14 PM ISTUpdated : Jul 21, 2022, 03:38 PM IST
Presidential Election Result: భారీ ఆధిక్యంలో ద్రౌపది ముర్ము.. ఆమెకు ఎంతమంది ఎంపీలు ఓటేశారంటే..

సారాంశం

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమెకు మద్దతుగా 540 ఎంపీలు ఓటు వేశారు. ప్రస్తుత గణంకాలను పరిశీలిస్తే ఆమె భారీ మెజారిటీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన.. ఎంపీల ఓట్ల లెక్కింపు పూర్తైనట్టుగా రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ జనరల్ సెక్రటరీ పీసీ మోదీ వెల్లడించారు. ఇందులో ద్రౌపది ముర్ముకు 540 మంది ఎంపీలు ఓటు వేశారని, యశ్వంత్ సిన్హాకు 208 ఎంపీలు ఓటు వేశారని చెప్పారు. అయితే 15 మంది ఎంపీల ఓటు చెల్లకుండా పోయాయని వెల్లడించారు. 

ద్రౌపది ముర్ము పోలైన ఎంపీల ఓట్ల విలువ 3,78,000గా ఉందని.. మరోవైపు యశ్వంత్ సిన్హాకు పోలైన ఓట్ల విలువ 1,45,600గా ఉందని పీసీ మోదీ చెప్పారు. . ఇక, ఈ ఎన్నికలో ఎంపీ విలువ 700గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక, ఇప్పటికే ఎంపీల ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో.. అనంత‌రం ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆంగ్ల అక్షరమాల ప్రకారం రాష్ట్రాల వారీగా ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఎమ్మెల్యేల ఓటు ఒక్కో రాష్ట్రానికి వేర్వేరుగా ఉన్నా సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 


ఇక, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. ఈ నెల 18న పోలింగ్ జరగగా 99 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. పార్లమెంట్ హౌస్‌తో పాటు, రాష్ట్రాల శాసనసభలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో వీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం.. 771 మంది ఎంపీలు, 4,025 మంది ఎమ్మెల్యేలతో సహా 4,796 మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. అయితే మొత్తం 771 మంది ఎంపీలలో 763 మంది ఓటు వేశారు (98.9 శాతం పోలింగ్). మొత్తం 4,025 మంది ఎమ్మెల్యేలలో 3,991 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు (99.1 శాతం పోలింగ్). అయితే వివిధ కారణాలతో 8 మంది ఎంపీలు, 34 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయలేదు. 

అయితే పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ద్రౌపది ముర్ముకు మద్దతుగా ఓటు వేశారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే భారీ మెజారిటీతో ద్రౌపది ముర్ము విజయం సాధిస్తుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది.  

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌