డబ్బు పంపిణీ చేస్తూ బుక్కైన ఎంపీ అభ్యర్థి: ఎలక్షన్ రద్దు చేసిన సిఈసీ

By Nagaraju penumalaFirst Published Apr 16, 2019, 8:07 PM IST
Highlights

డీఎంకే అభ్యర్థి నగదు పంపిణీ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 14న రాష్ట్రపతికి నివేదిక సమర్పించింది. ఎన్నిక వాయిదా వెయ్యాలని  కోరింది. ఎన్నికల సంఘం సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో వేల్లూరు లోక్ సభ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. డీఎంకే అభ్యర్థి దగ్గర మెుత్తం రూ.11.54 కోట్లు లభించినట్లు ఎన్నికల సంఘం రాష్ట్రపతి సిఫారసులో పేర్కొంది.  

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో డబ్బు పంపిణీ చేస్తున్నట్లు నిర్ధారణకు రావడంతో లోక్ సభ నియోజకవర్గం ఎన్నికను రద్దు చేసింది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు లోక్ సభ నియోజకవర్గం ఎన్నికను రద్దు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 

వెల్లూరులో భారీగా నగదు లభించడంతో ఎన్నికలు రద్దు చేసినట్లు ప్రకటించింది. అంతేకాదు డబ్బు పంపిణీ చేస్తూ డీఎంకే అభ్యర్థి దొరైమురుగన్ అడ్డంగా దొరికి పోవడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

అంతేకాదు దొరైమురుగన్ వద్ద భారీ స్థాయిలో నగదు లభ్యం కావడంతో ఎన్నిక వాయిదా అనివార్యమైనట్లు స్పష్టం చేసింది. డీఎంకే అభ్యర్థి నగదు పంపిణీ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 14న రాష్ట్రపతికి నివేదిక సమర్పించింది. ఎన్నిక వాయిదా వెయ్యాలని  కోరింది. 

ఎన్నికల సంఘం సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో వేల్లూరు లోక్ సభ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. డీఎంకే అభ్యర్థి దగ్గర మెుత్తం రూ.11.54 కోట్లు లభించినట్లు ఎన్నికల సంఘం రాష్ట్రపతి సిఫారసులో పేర్కొంది.  

వెల్లూరు లోక్ సభకు ఎన్నిక రద్దు కావడంతో తమిళనాడులో 38 స్థానాల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే వెల్లూరులో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్న అంశంపై త్వరలో ప్రకటించనున్నట్లు ఈసీ ప్రకటించింది. 

click me!