ప్రయాగరాజ్ కుంభమేళాలో అమృత కలశం ... అద్భుతమైన సెల్ఫీ పాయింట్

By Arun Kumar P  |  First Published Nov 6, 2024, 10:26 AM IST

మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్ మ్యూజియం అమృత కలశాన్ని ఏర్పాటుచేస్తోంది. దీన్ని సెల్పీ పాయింట్ గా అభివృద్ది చేయనున్నారు. 


ప్రయాగరాజ్ : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఈసారి రాష్ట్ర ప్రభుత్వం మహా కుంభమేళాన్ని గతంలో కంటే అత్యంత ఘనంగా, నిర్వహించడానికి  కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రయాగరాజ్ మ్యూజియం కూడా ఈ మహా కుంభమేళా కోసం సరికొత్తగా ప్రయత్నాలు చేస్తోంది. భారతీయ కళలు, సంస్కృతిని ప్రదర్శించడానికి మేళా నిర్వాహకుల నుండి దాదాపు 12 వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించాలని కోరింది.

సెల్ఫీ పాయింట్‌గా అభివృద్ధి

మ్యూజియం డిప్యూటీ క్యూరేటర్ డాక్టర్ రాజేష్ మిశ్రా మాట్లాడుతూ... మహా కుంభమేళా సందర్భంగా మ్యూజియం ఏర్పాటు చేసే అమృత కలశం దేశ విదేశాల నుండి వచ్చే భక్తులను ఆకర్షించేలా ఉంటుందన్నారు. అమృతం జాలువారుతున్నగా ఆకర్షణీయంగా వుండే కలశంను భక్తులకు సెల్ఫీ పాయింట్‌గా అభివృద్ధి చేయాలని ప్రణాళిక ఉంది. మహా కుంభమేళా పౌరాణిక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈసారి అమృత కలశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

స్వాతంత్య్ర సమరయోధుల గాథ 

Latest Videos

అంతేకాకుండా ఈ మ్యూజియం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 1857 నుండి స్వాతంత్య్రం వచ్చే వరకు జరిగిన స్వాతంత్య్ర పోరాటం...ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుల గాథను ప్రదర్శించే ఒక ప్రత్యేకమైన గ్యాలరీని నిర్మించింది. ఇలా ఆద్యాత్మిక కుంభమేళాలో దేశభక్తి కూడా మిళితం కానుంది. 

ప్రయాగరాజ్ మ్యూజియం 90 ఏళ్ల విప్లవాన్ని పునరుజ్జీవింపజేయనుంది. ఇక్కడ మంగళ్ పాండే నుండి చంద్రశేఖర్ ఆజాద్ వరకు అందరు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుల గురించి ప్రజలకు తెలుసుకోవచ్చు. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి గ్యాలరీలో ఇంతమంది స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించడానికి, వారి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది. 1857 నుండి 1947 వరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి వీరుడి చరిత్ర తెలుసుకుని ప్రజలు ఆశ్చర్యపోతారు. 

click me!