నీటిపై తేలియాడుతూనే భోజనం ... ప్రయాగరాజ్ కుంభమేళాలో పర్యాటకులకు వినూత్న అనుభూతి

By Arun Kumar P  |  First Published Oct 26, 2024, 2:10 PM IST

2025 ప్రయాగరాజ్ మహాకుంభ్‌లో యాత్రికుల కోసం యూపీ టూరిజం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.పర్యాటకులు వినూత్న అనుభూతిని పొందేలా సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళుతోంది. .


ప్రయాగరాజ్ : మహా కుంభమేళాలో పాల్గొనే యాత్రికులకు, పర్యాటకుల కోసం యూపీ టూరిజం సరికొత్త ఏర్పాట్లు చేస్తోంది. వారికి వీలైనన్ని ఎక్కువ సౌకర్యాలు కల్పించడమే కాదు సరికొత్త అనుభూతిని పంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే పర్యాటకులకు తేలియాడే రెస్టారెంట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది.

ప్రయాగరాజ్‌లోని యమునా నదిపై యూపీలోనే మొట్టమొదటి తేలియాడే రెస్టారెంట్ ను పర్యాటక శాఖ ఏర్పాటుచేసింది. దీన్ని గతేడాది చివర్లో (డిసెంబర్ 2023) సీఎం యోగి ప్రారంభించారు... యూపీఎస్టీడీసీ ఈ రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది. ఇలా తేలియాడే రెస్టార్టెంట్ లో భోజనం చేయడం కుంభమేళాకు విచ్చేసే దేశవిదేశి పర్యాటకులకు కొత్త, వినూత్న అనుభూతిని అందిస్తుంది.

Latest Videos

undefined

యూపీలోనే తొలి ప్లోటింగ్ రెస్టారెంట్ 

యూపీ టూరిజంకి చెందిన యూపీఎస్టీడీసీ ఆధ్వర్యంలో ప్రయాగరాజ్‌లోని త్రివేణి బోట్ క్లబ్‌లో ఈ తేలియాడే రెస్టారెంట్ ను ఏర్పాటుచేసారు... ఇది డిసెంబర్ 2023 నుంచి నడుస్తోంది. యమునా నది అలలపై తేలియాడే ఈ రెస్టారెంట్ యూపీలోనే మొట్టమొదటిదని పర్యాటక అధికారి అపరాజిత సింగ్ తెలిపారు. సీఎం యోగి మార్గదర్శకత్వంలో ఇదే విధమైన ప్రయోగాన్ని గోరఖ్‌పూర్‌లోని రాంగఢ్ తాల్‌లో కూడా చేపట్టామని తెలిపారు.

ఈ ప్లోటింగ్ రెస్టారెంట్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రయాగరాజ్ వాసులు గత కొన్ని నెలలుగా ఈ తేలియాడే రెస్టారెంట్‌ని ఆస్వాదిస్తున్నారు. సీఎం యోగి ఆకాంక్ష మేరకు యూపీ టూరిజం ఈసారి ఈ అనుభవాన్ని  కుంభమేళా పర్యాటకులకు కూడా అందుబాటులోకి తెస్తోంది.  కుంభమేళాలో పవిత్ర స్నానం, ఆధ్యాత్మిక అనుభవంతో పాటు పర్యాటకులకు తేలియాడే రెస్టారెంట్ కూడా ఆకర్షణీయంగా నిలుస్తుంది. దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు తేలియాడే రెస్టారెంట్ కొత్త అనుభూతినిస్తుంది.

ఈ ప్లోటింగ్ రెస్టారెంట్ ప్రయాగరాజ్‌లోని యమునా బ్యాంక్ రోడ్డులో ఉన్న యూపీ టూరిజంకి చెందిన త్రివేణి బోట్ క్లబ్‌లో ఉంది. రెస్టారెంట్‌ను టూరిజం శాఖ సంస్థ యూపీఎస్టీడీసీ నిర్వహిస్తోంది. 40 సీట్లతో అన్ని సౌకర్యాలను కలిగివుందని రెస్టారెంట్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ దీపక్ టండన్ తెలిపారు. రెస్టారెంట్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. మహాకుంభ్ సందర్భంగా రెస్టారెంట్ సమయాల్లో మార్పులు చేయనున్నారు. దీంతో పాటు యూపీఎస్టీడీసీ యమునా బ్యాంక్ రోడ్డులో రాహీ త్రివేణి దర్శన్ హోటల్‌ను కూడా నిర్వహిస్తోంది. ఇక్కడ సంగమ స్నానానికి వచ్చే యాత్రికులకు బస చేసే సౌకర్యం కూడా ఉంది.

click me!