ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025లో భక్తుల భద్రత కోసం డిజిటల్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. QR కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా భక్తులు పోలీసుల సహాయాన్ని పొందే ఏర్పాటు చేసారు. అదెలాగో చూద్దాం.
మహాకుంభ నగరి : ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో భక్తుల భద్రత కోసం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో డిజిటల్ సాంకేతికతను కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మొదటిసారిగా మహాకుంభమేళాకు వచ్చే భక్తులు సోషల్ మీడియా ద్వారా క్షణక్షణం అప్‌డేట్‌లు అందుకోనున్నారు. తమ సమాచారాన్ని సెకన్లలో పోలీసు ఉన్నతాధికారుల నుండి కిందిస్థాయి అధికారుల వరకు చేరవేయగలరు. ఇలా మహా కుంభమేళాలో పోలీసులు భద్రత కోసం నాలుగు డిజిటల్ ఎంట్రీలను ఏర్పాటు చేశారు... వీటి ద్వారా ఇవన్నీ క్షణాల్లో జరుగుతాయి. భక్తులు కేవలం QR కోడ్‌ను స్కాన్ చేస్తే చాలా... వెంటనే భద్రతా వ్యవస్థతో అనుసంధానమవుతారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈసారి మహాకుంభమేళాను ఘనంగానే కాదు భద్రతతో జరుపుకునేలా ఏర్పాట్లు చేసారు. భక్తులకు ఎటువంటి కొరత లేకుండా చూస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు దేశవిదేశాల నుండి వచ్చే భక్తులకు అన్ని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా భద్రతకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మహాకుంభంలోకి వచ్చే భక్తుల డిజిటల్ భద్రత కోసం పూర్తి ఏర్పాట్లు చేశారు.
మహా కుంభమేళా అధికారి తెలిపిన వివరాల ప్రకారం... మొదటిసారిగా ఇక్కడ నాలుగు రకాల QR కోడ్‌లను విడుదల చేశారు. వీటిని స్కాన్ చేయగానే మహాకుంభ భద్రత యొక్క నాలుగు డిజిటల్ ఎంట్రీలు తెరుచుకుంటాయి. ఇలా X, Facebook, Instagram మరియు YouTube ద్వారా సురక్షిత మహాకుంభం కోసం పూర్తి ప్రణాళికను రూపొందించారు.
మహా కుంభమేళాలో డిజిటల్ ఐ 24 గంటలు అప్రమత్తంగా ఉంటాయి. దీనితో అనుసంధానమై భక్తులకు భద్రతకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ అందుతుంది. ప్రజల సౌలభ్యం కోసం ఇక్కడ కమిషనరేట్ ప్రయాగ్‌రాజ్ హ్యాండిల్, మహాకుంభ మేళా హ్యాండిల్ అందుబాటులో ఉంటాయి. భద్రత, కొత్త అప్‌డేట్‌ల కోసం వీటిని స్కాన్ చేయవచ్చు. భద్రతతో పాటు ప్రజల అభిప్రాయాలను కూడా ఇక్కడ సేకరిస్తారు. అత్యవసర సమాచారాన్ని కూడా ఇక్కడ అప్‌డేట్ చేస్తారు.