కొత్త సంవత్సరం ప్రారంభంరోజున మహా కుంభమేళా కోసం ఏర్పాటుచేసిన సెంట్రల్ హాస్పిటల్‌లో 900 మంది వైద్య సేవలు పొందారు. యోగి ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటుచేసిన హైటెక్ సౌకర్యాలు, ఏఐ సాంకేతికతను ఉపయోగించి వీరికి వైద్యం అందించారు.
ప్రయాగరాజ్: కొత్త సంవత్సరం ప్రారంభంతోనే మహా కుంభమేళా సందడి మొదలైంది. యోగి ప్రభుత్వం కుంభమేళా కోసం ప్రయాగరాజ్ లో భారీ ఏర్పాట్లు చేయడంతో దేశవిదేశాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కొత్త సంవత్సరం మొదటి రోజున మహాకుంభ్ నగర్‌లోని సెంట్రల్ హాస్పిటల్‌లో 900 మంది వైద్య సేవలు పొందారు. దేశంలోని పెద్దపెద్ద హాస్పిటల్స్ లో ఉండే హైటెక్ సాంకేతికతను ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఇందులో ECG వంటి వైద్య సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహాకుంభ్‌ను గతంలో కంటే అద్భుతంగా నిర్వహించాలని కోరుకుంటున్నారు. ప్రపంచంలో ఉత్తరప్రదేశ్‌కు మంచి పేరు రావాలని అధికారులను జాగ్రత్తగా ఎంపిక చేశారు. వారి పనితీరు అద్భుతంగా వుంది.
ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు మహాకుంభ్ నగర్‌లోని సెంట్రల్ హాస్పిటల్‌లో వైద్య సేవలు పొందుతున్నారు. వైద్యులు కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. చాలా సార్లు వైద్యులు స్వయంగా ముందుకొచ్చి రోగులకు సహాయం చేస్తున్నారు.
మహా కుంభమేళా నోడల్ వైద్యాధికారి డాక్టర్ గౌరవ్ దూబే మాట్లాడుతూ... మహాకుంభ్ నగర్‌లోని సెంట్రల్ హాస్పిటల్‌లో కొత్త సంవత్సరం మొదటి రోజున 900 మంది ఓపీ సేవలు పొందారని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ప్రతిరోజూ 800 నుండి 900 మంది వైద్య సేవలు పొందడానికి వస్తున్నారన్నారు. వీరికి వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక వైద్యులు ఉన్నారు.
సీఎం యోగి ఆదేశాల మేరకు రోగులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని... ECG సౌకర్యం కూడా ప్రారంభమైందన్నారు సెంట్రల్ పాథాలజీలో ప్రతిరోజూ 100 కంటే ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. భక్తులకు 50కి పైగా ఉచిత పరీక్షలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ గౌరవ్ వెల్లడించారు..
ఈసారి మహాకుంభ్‌లో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. రోగులు, వైద్యుల మధ్య భాషా అవరోధాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా తొలగించారు. ఏ భాషలో మాట్లాడినా AI సాంకేతికత సహాయంతో వైద్యులు వారికి చికిత్స అందించగలరు. దేశంలో మొదటిసారిగా మహాకుంభ్ నగర్‌లో హైటెక్ AI మెసేజింగ్ ఫ్లో సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. యోగి ప్రభుత్వం ఈ కొత్త చర్య రోగుల ఇంటెన్సివ్ కేర్‌కు కూడా ఉపయోగపడుతుంది. 22 ప్రాంతీయ, 19 అంతర్జాతీయ భాషలను అర్థం చేసుకుని AI వైద్యులకు రోగి మనసులోని మాటను తెలియజేస్తుంది.