ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో భక్తులు సైబర్ నేరాల భారిన పడకుండా యోగి సర్కార్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం 56 మంది సైబర్ యోధులను ప్రత్యేకంగా నియమించారు. వీరు ఎలా పనిచేయనున్నారంటే..
ప్రయాగరాజ్ : మహా కుంభమేళాకు వచ్చే భక్తులకు సైబర్ భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది యోగి సర్కార్. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తుల భద్రత కోసం ప్రత్యేకంగా 56 మంది సైబర్ యోధులను నియమిస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు డిజిటల్ కుంభ్‌ను ఎస్ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సైబర్ భద్రతా ప్రత్యేక ప్రణాళికలో భాగంగా సైబర్ నేరగాళ్ళ నియంత్రణకు పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
ముఖ్యమంత్రి యోగి ఆదేశాల మేరకు మహా కుంభనగరిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక సైబర్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో సైబర్ పెట్రోలింగ్ నిపుణులను నియమిస్తున్నారు. మేళాతో పాటు ప్రయాగరాజ్ అంతటా వీఎండీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఏఐ, ఎక్స్, ఫేస్‌బుక్, గూగుల్‌లను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు.
undefined
మహా కుంభమేళాకు దాదాపు 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులకు అవగాహన కల్పించేందుకు యోగి ప్రభుత్వం ప్రింట్, డిజిటల్, సోషల్ మీడియా వంటి అన్ని వ్యవస్థలను ఉపయోగించాలని నిర్ణయించింది. ఈ ప్రణాళికలో భాగంగా మేళా ప్రాంతం, కమిషనరేట్ అంతటా వేరియబుల్ మెసేజ్ డిస్‌ప్లే (వీఎండీ)లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ ప్రణాళిక ప్రకారం 40 వీఎండీలను మేళా ప్రాంతంలో, 40 వీఎండీలను కమిషనరేట్‌లో ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా సైబర్ భద్రతపై భక్తులకు అవగాహన కల్పించి, సైబర్ నేరగాళ్ల నుంచి రక్షణ పొందేలా చూస్తారు.
సైబర్ నేరగాళ్ల నకిలీ లింక్‌లను పూర్తిగా నియంత్రిస్తారు. రాష్ట్రంలోని ఎంపిక చేసిన నిపుణుల బృందం ఇప్పటికే దాదాపు 50 వెబ్‌సైట్లను గుర్తించి, వాటిపై చర్యలు ప్రారంభించింది. ఆన్‌లైన్ భద్రత కోసం మొబైల్ సైబర్ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది భక్తులకు అవగాహన కల్పిస్తోంది. మహా కుంభమేళాకు సంబంధించిన సమాచారం కోసం 1920 నంబర్‌ను కూడా విడుదల చేశారు. దీంతో పాటు ప్రభుత్వ వెబ్‌సైట్లను (gov.inతో ముగిసేవి) ఉపయోగించవచ్చు.నకిలీ వెబ్‌సైట్ల సమాచారాన్ని కూడా ఠాణాకు అందించవచ్చు. దీనిపై సైబర్ ఠాణా వెంటనే చర్యలు తీసుకుంటుంది. ఏఐ, ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డబ్బులు వసూలు చేసే నేరగాళ్లపై కూడా సైబర్ నిపుణులు నిఘా పెట్టారు. ఫిర్యాదు అందిన వెంటనే వారిపై చర్యలు తీసుకుంటారు. నకిలీ వెబ్‌సైట్లు, లింక్‌ల ద్వారా మోసాలు చేసేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు.
మహా కుంభ్ ఏఎస్పి రాజేష్ ద్వివేది మాట్లాడుతూ... 56 పోలీస్ స్టేషన్లలో సైబర్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సైబర్ నేరగాళ్ల గురించి మేళా ప్రాంతం అంతటా వీఎండీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.