ప్రయాగరాజ్ కుంభమేళాలో యూపీ పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు

By Arun Kumar PFirst Published Oct 25, 2024, 9:26 PM IST
Highlights

ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025 లో భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది యూపీ టూరిజం. 

ప్రయాగరాజ్ : మహా కుంభమేళాకు విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు యూపీ సర్కార్ ఏర్పాాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే మేళా అథారిటీ, జిల్లా అధికార యంత్రాంగం, మున్సిపల్ శాఖ పరిధిలోని వివిధ విభాగాలు యోగి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. ఈ క్రమంలో యూపీ టూరిజం భక్తులకు, స్నానార్థులకు ప్రత్యేక సౌకర్యం కల్పించనుంది.

ఈ కుంభమేళాలో తొలిసారిగా యూపీ టూరిజం మినీ క్రూజ్, స్పీడ్ బోట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. భక్తులు త్రివేణి బోట్ క్లబ్ నుండి సంగమ స్నానానికి మినీ క్రూజ్ లేదా స్పీడ్ బోట్‌లో వెళ్లవచ్చు. పర్యాటక శాఖ భక్తులకు సులభంగా సంగమ ప్రాంతానికి చేరవేసేందుకు ఈ ఏర్పాట్లు చేసింది.

Latest Videos

కుంభమేళా ఏర్పాట్లపై పర్యాటక అధికారి అపరాజిత సింగ్ మాట్లాడుతూ...  తొలిసారిగా సంగమ స్నానానికి మినీ క్రూజ్, స్పీడ్ బోట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సౌకర్యం డిసెంబర్ 2023 నుంచి అందుబాటులో వుంది... కుంభమేళా సమయంలో పర్యాటక శాఖ ఈ సేవలను అందిస్తుందన్నారు.

యూపీఎస్టీడీసీ వాటర్ స్పోర్ట్స్ సౌకర్యాన్ని సీఎం యోగి ప్రారంభించారని ఆమె తెలిపారు. దీని ద్వారా ప్రయాగరాజ్‌లోని త్రివేణి బోట్ క్లబ్ నుండి సంగమానికి కొద్ది నిమిషాల్లోనే చేరుకోవచ్చని అన్నారు. ప్రయాగరాజ్‌లోని యమునా బ్యాంక్ రోడ్డులో ఉన్న త్రివేణి బోట్ క్లబ్ నుండి ఈ సౌకర్యం సాధారణ రోజుల్లో కూడా అందుబాటులో ఉంటుందన్నారు. బోట్ క్లబ్ సమీపంలోని హెలిప్యాడ్ నుండి వచ్చే విదేశీ, ప్రముఖ భక్తులను సులభంగా సంగమానికి చేర్చడమే దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారు. త్రివేణి బోట్ క్లబ్ హెలిప్యాడ్ నుండి నడిచే దూరంలో ఉంది.

త్రివేణి బోట్ క్లబ్ నిర్వాహకుడు దీపక్ టండన్ మాట్లాడుతూ... ప్రస్తుతం బోట్ క్లబ్‌లో 6 సిక్స్ సీటర్ స్పీడ్ బోట్లు, 2 థర్టీ ఫైవ్ సీటర్ మినీ క్రూజ్‌లు, 2 రెస్క్యూ బోట్లు ఉన్నాయని తెలిపారు. స్పీడ్ బోట్ ప్రయాణానికి ఓ వ్యక్తికి రూ.200 లేదాా గంటకు రూ.2000,  మినీ క్రూజ్ ధర రూ.150 లేదా గంటకు రూ.5000 చెల్లించాలని తెలిపారు.. రెండు బోట్లను కుటుంబం కోసం పూర్తిగా బుక్ చేసుకోవచ్చు.

మినీ క్రూజ్‌లో మహిళలకు దుస్తులు మార్చుకోవడానికి క్యాబిన్ కూడా ఉందని తెలిపారు సంగమ స్నానంతో పాటు, బోట్ క్లబ్ పర్యాటకులను యమునా నదిలో విహారయాత్ర, సుజావన్ దేవ్ ఆలయ సందర్శనకు కూడా తీసుకెళ్తుంది. మహాకుంభ్ సమయంలో స్పీడ్ బోట్ల సంఖ్యను పెంచే ప్రయత్నం జరుగుతోంది. ఇంతకుముందు యమునా బోట్ క్లబ్, పీడీఏ కూడా ఇలాంటి సౌకర్యాన్ని కల్పించాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మహాకుంభ్‌లో తొలిసారిగా స్పీడ్ బోట్, మినీ క్రూజ్‌ల ద్వారా సంగమ స్నానం చేసే అవకాశం భక్తులకు లభిస్తుంది.
 

click me!