ప్రయాగరాజ్ మహాకుంభ్ 2025 కోసం ఏకంగా 10 వేల మంది పారిశుధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తునున్నారు. వారి వసతి, భోజనం, పిల్లల చదువులకు యోగి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
ప్రయాగరాజ్ : మహా కుంభమేళా వేళ కూడా ప్రయాగరాజ్ ను పరిశుభ్రంగా, అందంగా వుంచాలనేది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ఆలోచన. ఇందుకోసం మేళా అధికారులు పూర్తి సన్నద్ధతతో కృషి చేస్తున్నారు. దాదాపు 10 వేల మంది పారిశుధ్య కార్మికులు మహా కుంభమేళా ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. సీఎం యోగి ఆకాంక్ష మేరకు స్వచ్ఛ మహాకుంభమమేళా లక్ష్యసాధనకు వీరు కృషి చేస్తున్నారు.
కుంభమేళా సమీపిస్తున్న కొద్దీ పారిశుద్ద్య కార్యకలాపాలు మరింత ఊపందుకుంటున్నాయి. ఈ కార్మికుల సంక్షేమం, గౌరవానికి యోగి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. స్వచ్ఛ కుంభ్ కోశ్ ద్వారా వారి వసతి, భోజనం, పిల్లల ఉచిత విద్యకు ఏర్పాట్లు చేస్తోంది. యోగి ప్రభుత్వం ఈ చర్యల ద్వారా మహ కుంభమేళాలో పరిశుభ్రతతో పాటు పారిశుధ్య కార్మికులకు, వారి కుటుంబాలకు విద్య, ఆరోగ్యం, ఆర్థిక భద్రత అందిస్తోంది.
undefined
మహా కుంభమేళా ప్రత్యేక అధికారిణి ఆకాంక్ష రాణా మాట్లాడుతూ...స్వచ్ఛ మహా కుంభమేళా సాధనలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమని అన్నారు. ఈ కార్మికులు రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారన్నారు. సీఎం యోగి ఆదేశాల మేరకు వారి భద్రత, సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మేళా ప్రాంతంలో పారిశుధ్య కార్మికుల కోసం ప్రత్యేక కాలనీ నిర్మించాం... అక్కడ వారికి ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించాం. ఈ చర్య వల్ల కార్మికులకు విశ్రాంతి, భద్రత లభిస్తుందన్నారు.
మహా కుంభమేళాలో పనిచేేసే పారిశుధ్య కార్మికుల పిల్లల చదువులకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని ఆకాంక్ష రాణా తెలిపారు. ప్రతి సెక్టార్‌లో ఒక ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇటీవలే మేళా ప్రాంతంలో ఒక ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం... అక్కడ పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలను కూడా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు కూడా ఉంటాయన్నారు. అవసరమైతే కొన్ని సెక్టార్లలో ఒకటి కంటే ఎక్కువ పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు.
పారిశుధ్య కార్మికుల వేతనాలను వేగంగా చెల్లిస్తున్నాం, తద్వారా వారి రోజువారీ అవసరాలు తీరుతాయని ఆకాంక్ష రాణా తెలిపారు. వేతనాలను ప్రతి 15 రోజులకు ఒకసారి డిబిటి ద్వారా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు.
మహా కుంభమేళా విజయవంతం చేయడానికి, ప్రయాగరాజ్ ను పరిశుభ్రంగా ఉంచడానికి స్వచ్ఛ్ కుంభ్ కోశ్‌ను ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా పారిశుధ్య కార్మికులకు అన్ని విధాలా సహాయం అందిస్తున్నామన్నారు. అంతేకాదు వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానించే ప్రయత్నం చేస్తున్నాం తద్వారా వారు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం అవుతారని మహా కుంభమేళా ప్రత్యేక అధికారిణి ఆకాంక్ష రాణా వెల్లడించారు.