2025 మహాకుంభం కోసం ప్రయాగరాజ్ ఎయిర్‌పోర్ట్‌ను పునరుద్ధరిస్తున్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో విమానాశ్రయాన్ని తీర్చిదిద్దడానికి యోగి సర్కార్ ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా?
ప్రయాగరాజ్ : వచ్చే ఏడాది జరగనున్న ప్రయాగరాజ్ కుంభమేళాకు యోగి సర్కార్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. త్రివేణి సంగమంలో జరిగే ఈ కుంభమేళాకు దేశ నలుమూలలనుండి సామాన్య ప్రజలే కాదు విదేశాల నుండి కూడా పర్యాటకులు తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రయాగరాజ్ కు ఈజీగా చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది యోగి సర్కార్.
ఇప్పటికే ప్రయాగ రాజ్ కు రోడ్డు, రైలు మార్గాల విస్తరణ చేపట్టింది యూపీ సర్కార్. అలాగే విమానయాన సదుపాయాలను కూడా మెరుగుపరుస్తున్నారు... ఇందులో భాగంగానే విమానాశ్రయంలో సౌకర్యాలను విస్తరిస్తున్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాగరాజ్ పర్యటన తర్వాత మహాకుంభం ఏర్పాట్లు మరింత వేగవంతమయ్యాయి.
undefined
మహాకుంభం సందర్భంగా ఇతర దేశాల నుండి వచ్చే పర్యాటకులు, భక్తుల సౌలభ్యం కోసం ప్రయాగరాజ్ ఎయిర్‌పోర్ట్‌ను పునరుద్ధరిస్తున్నారు. మహాకుంభం సందర్భంగా వచ్చే ప్రయాణికుల కోసం 274.38 కోట్ల రూపాయలతో ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేపడుతున్నట్లు ... ఇందులో దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఫరూఖ్ అహ్సాన్ తెలిపారు.
ప్రయాగరాజ్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రస్తుతం 6700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక టెర్మినల్ భవనం ఉంది.... దీనిని రెండు విధాలుగా విస్తరిస్తున్నారు. ఒక వైపు కొత్త టెర్మినల్ భవన నిర్మాణం జరుగుతుండగా, పాత టెర్మినల్‌కు కొత్త రూపాన్ని ఇస్తున్నారు. 231 కోట్ల రూపాయలతో కొత్త టెర్మినల్ భవన నిర్మాణం జరుగుతోంది. దీని నిర్మాణంతో ప్రయాణీకుల నిర్వహణ వేదిక (పిహెచ్‌పి) సామర్థ్యం 1200కి పెరుగుతుంది. దీనిలో 48 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు డిసెంబర్ 31లోపు పూర్తి కావచ్చని అంచనా.
అదేవిధంగా ప్రస్తుత టెర్మినల్‌కు కూడా కొత్త రూపాన్ని ఇస్తున్నారు. దీంతో పిహెచ్‌పి సామర్థ్యం 350 నుండి 850కి పెరుగుతుంది. దీనిలో 70 శాతం పనులు పూర్తయ్యాయి. దీని నిర్మాణం అక్టోబర్ 31లోపు పూర్తి కానుంది. విమానాశ్రయంలో చెక్-ఇన్ కౌంటర్లను కూడా విస్తరిస్తున్నారు. వీటి సంఖ్య 42కి పెరుగుతోంది.
విమానాశ్రయంలో ఆప్రాన్, లింక్ ట్యాక్సీ మార్గాల నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది. 29 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం జరుగుతోంది, ఇది అక్టోబర్ 31లోపు పూర్తి కానుంది. విమానాశ్రయంలో విమానాలను నిలిపి ఉంచడానికి ఆప్రాన్ విస్తరణ దాదాపు 95 శాతం పూర్తయింది. ఇప్పుడు ఇక్కడ ఒకేసారి పది, పదకొండు చిన్న విమానాలను సులభంగా నిలిపి ఉంచవచ్చని విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు.
విమానాశ్రయంలో విమానాల రాకపోకలు పెరగడంతో పాటు ప్రయాణీకుల బోర్డింగ్ వంతెనల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ప్రయాగరాజ్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రస్తుతం రెండు ఏరోబ్రిడ్జ్‌లు ఉన్నాయి. మహాకుంభం ముందు వీటి సంఖ్యను ఆరుకు పెంచుతారు. ఈ విస్తరణ తర్వాత యూపీలో ఆరు ఏరోబ్రిడ్జ్ లు కలిగిన ఏకైక విమానాశ్రయంగా ప్రయాగరాజ్ ఎయిర్‌పోర్ట్ నిలవనుంది.