Prashant Kishor: ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్.. ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన..

Published : May 02, 2022, 10:13 AM ISTUpdated : May 02, 2022, 11:08 AM IST
Prashant Kishor: ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్.. ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన..

సారాంశం

ప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తన సొంత రాష్ట్రమైన  బీహార్ నుంచి పొలిటికల్ జర్నీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

ప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తన సొంత రాష్ట్రమైన  బీహార్ నుంచి పొలిటికల్ జర్నీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పదేళ్లుగా ప్రజల పక్షాన విధానాలను రూపొందించానని చెప్పారు. అర్దవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశానని తెలిపారు. ప్రజా సమస్యలు మరింతగా అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రజలకు చేరువకావాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. సుపరిపాలన (జన్ సురాజ్) దిశగా అడుగులు వేస్తున్నానని.. బిహార్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు. 

అయితే ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ ట్వీట్‌తో.. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా స్పష్టం చేశారు. అయితే కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నారా..?, లేక మరేదైనా కూటమిని ఏర్పాటు చేసి ముందుకు సాగుతారా..? అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. బిహార్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్టుగా వెల్లడించారు. అయితే  నాలుగేళ్ల క్రితం నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూలో చేరిన పీకే.. ఏడాది కాలానిపైగా అందులో కొనసాగారు. ఆ తర్వాత ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే బిహార్ నుంచి ప్రయాణాన్ని ప్రారంభించనున్న పీకే.. తొలుత రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే అవకాశం ఉందని ఆయనకు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.  ఈ క్రమంలోనే క్షేత్ర స్థాయిలో ఓటర్ల అభిప్రాయాలను, సమస్యలను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే రాజకీయ పార్టీపై నిర్ణయం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. 

ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పలుమార్లు చర్చలు జరిపిన ప్రశాంత్ కిషోర్.. ఆ పార్టీకి  2024 ఎన్నికలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేశారు. అయితే పలు దఫాలుగా చర్చలు జరిగిన అవి ఫలించలేదు. ఈ క్రమంలోనే పార్టీలో చేరాలని కాంగ్రెస్‌లో చేసిన ప్రతిపాదనను తిరస్కరించినట్టుగా పీకే ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్న సమయంలో పీకే.. తెలంగాణకు వచ్చి గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌తో చర్చలు జరిపారు. ఇక, ఇప్పటికే ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ పలు పార్టీలకు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. 


 

ఇక, ఇప్పటికే ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ పలు ప్రాంతీయ పార్టీలకు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీలతో పీకేకు మంచి సంబంధాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ముందుకు సాగాలని పీకే భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.  

PREV
click me!

Recommended Stories

భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?
Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?