అసహనం, ఆందోళన జాతీయతను దెబ్బతీస్తాయి: ప్రణబ్

First Published Jun 7, 2018, 7:10 PM IST
Highlights

ప్రణబ్ పై కాంగ్రెస్ కన్నెర్ర

నాగ్‌పూర్: అసహనం, ఆందోళన అనేవి జాతీయత అనే భావనను దెబ్బతీస్తున్నాయని ప్రణబ్
ముఖర్జీ అభిప్రాయపడ్డారు.   
 

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ తృతీయ శిక్షావర్గ్ ముగింపు కార్యక్రమంలో
పాల్గొనేందుకు గాను గురువారం నాడు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఘనంగా స్వాగతం
పలికారు.

భరతమాత గొప్ప కొడుకు డాక్టర్ హేడ్గేవార్ కు నివాళులర్పించేందుకు తాను ఇక్కడకు 
వచ్చినట్టు ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. మోహన్ భగవత్ తో 20 నిమిషాల పాటు ప్రణబ్
ముఖర్జీ చర్చించారు.హేగ్డేవార్  మోమోరియల్‌ను కూడ ప్రణబ్ ముఖర్జీ  సందర్శించారు.

 

ఆర్ఎస్ఎస్  తృతీయ శిక్షావర్గ్ ముగింపు సమావేశంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ పాల్గొన్నారు. గురువారం నాడు మహరాష్ట్ర నాగ్‌పూర్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ తృతీయ శిక్షావర్గ్  ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించారు.

జాతీయత అనే అంశంపై  నా అభిప్రాయాన్ని మీతో చర్చించేందుకు నేను ఇక్కడకు వచ్చానని మాజీ  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. జాతీయత , దేశభక్తి  భావనలపై న అభిప్రాయాలను పంచుకొనేందుకు వచ్చినట్టు ప్రణబ్ ముఖర్జీ చెప్పారు.


అనేక మంది యాత్రికులు భారతదేశానికి వచ్చారని ఆయన గర్తు చేశారు.14వ శతాబ్దంలో ఫ్రెంచ్ ట్రావెలర్స్ దేశానికి వచ్చారు. 15వ, శతాబ్దంలో చైనా ట్రావెలర్స్ ఇండియాకు
వచ్చారని ఆయన గుర్తు చేశారు.ఈ యాత్రికులంతా భారతీయతను గురించి ప్రపంచానికి  చాటి చెప్పారని ఆయన చెప్పారు.వసుదైక  కుటుంబం, సర్వేజన సుఖినోభవంతు భావనను కలిగి ఉండాలని ప్రణబ్ ముఖర్జీ  అభిప్రాయపడ్డారు. 

 

స్వాతంత్ర్యం తర్వాత పటేల్ చొరవ మరువలేనిదని ఆయన గర్తు చేసుకొన్నారు.సంస్థానాలను దేశంలో విలీనం  చేయడంలో ఆయన పాత్రను మరువలేమన్నారు.  ప్రజలే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొన్న చరిత్ర భారత్ దని ఆయన చెప్పారు. 

 

ఈ సందర్భంగా ఆర్ఎష్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై ప్రశంసలు కురిపించారు.ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగిస్తూ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురించి ఎందుకు వచ్చారనే అనే చర్చ అనవసరమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్ఎస్ఎస్,
ప్రణబ్ ముఖర్జీ ఆలోచనలు  భిన్నమైనవి తెలుసునని ఆయన చెప్పారు. భారత్ వాసులమైనందున మరో వ్యక్తి పరాయి ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు.  ప్రణబ్ ముఖర్జీతో తనకు మంచి స్నేహం ఉందని ఆయన గుర్తు చేసుకొన్నారు. మంచి పరిపాలన అనుభవం ప్రణబ్ ముఖర్జీ  స్వంతమని ఆయన చెప్పారు.ఆర్ఎస్ఎస్ ..ఆర్ఎస్ఎస్సే , ప్రణబ్ ముఖర్జీ ప్రణబ్ ముఖర్జీయేనని ఆయన అభిప్రాయపడ్డారు.  నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రణబ్‌కు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో పుట్టినవారంతా భారతీయులేనని ఆయన చెప్పారు.భిన్నత్వంలో ఏకత్వం భారతీయు
స్వంతమని ఆయన గుర్తు చేశారు.

click me!