శాపం పెట్టాను కాబట్టే...: కర్కరేపై సాధ్వీ సంచలన వ్యాఖ్యలు

By telugu teamFirst Published Apr 20, 2019, 7:55 AM IST
Highlights

బీజేపీ నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్‌  తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.  ఉగ్రవాద నిరోధక దళం మాజీ చీఫ్‌, 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన హేమంత్‌ కర్కరేపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

బీజేపీ నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్‌  తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.  ఉగ్రవాద నిరోధక దళం మాజీ చీఫ్‌, 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన హేమంత్‌ కర్కరేపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ ఆరోపణలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు.

 2008 మాలేగావ్‌ పేలుళ్ల కేసులో నిందితురాలిగా తాను ముంబై జైల్లో ఉన్న రోజుల్లో కర్కరే తనను తీవ్ర వేఽధింపులకు గురిచేశారని, బూతులు తిట్టారని ఆరోపించారు. ఆయనను సర్వనాశనం అవుతావంటూ శపించానని, ఆ కారణంగానే కర్కరే అంతమయ్యారని చెప్పారు. 

అయితే.. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపడంతో.. కాస్త వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. భోపాల్ లో ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆమె కార్యర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ క్షమాపణలు  చెప్పారు.

ఆమె చేసిన ఆరోపణలు ఏంటంటే...‘‘ నేను జైల్లో ఉన్నప్పుుడు కర్కరేను కేసు విచారణ బృందంలోని ఓ సభ్యుడు ముంబయికి పిలిపించారు.  ప్రజ్ఞాసింగ్‌ కు వ్యతిరేకంగా ఆధారాలు లేనప్పుడు ఆమెను విడిచిపెట్టాలని కర్కరేకు ఓ అధికారి సూచించారు. అందుకు కర్కరే అంగీకరించలేదు.  ఆధారాలు సంపాదిస్తానని.. దొరకకపోతే సృష్టిస్తాను అని అన్నాడు. నాకేమీ తెలీదని.. అంతా దేవుడికే తెలుసు అని నేను చెప్పాను. దానికి ఆయన నన్ను బూతులు తిట్టాడు. దీంతో నాలో సహనం నశించి.. శపించాను. సరిగ్గా 45 రోజుల తర్వాత కర్కరే చనిపోయాడు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు దీనిపై ప్రశ్నించడంతో ఆమె క్షమాపణలు చెప్పారు. 
 

click me!