అశ్లీల వీడియో షూటింగ్.. పూనమ్‌ పాండేను అరెస్ట్‌ చేసిన పోలీసులు...

Bukka Sumabala   | Asianet News
Published : Nov 05, 2020, 04:16 PM IST
అశ్లీల వీడియో షూటింగ్.. పూనమ్‌ పాండేను అరెస్ట్‌ చేసిన పోలీసులు...

సారాంశం

వివాదస్పద నటి, హాట్‌ మోడల్‌ పూనమ్ పాండేను గోవా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అశ్లీల వీడియో చిత్రీకరణ అభియోగంపై పూనమ్ పాండేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   

వివాదస్పద నటి, హాట్‌ మోడల్‌ పూనమ్ పాండేను గోవా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అశ్లీల వీడియో చిత్రీకరణ అభియోగంపై పూనమ్ పాండేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పూనమ్‌ ఇటీవల గోవాలోని చపోలి ఆనకట్ట వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించిందని ఆరోపిస్తూ ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఆమెపై ఫిర్యాదు చేసింది. దీంతోపాటు పూనమ్‌ పాండేపై అసభ్యకరమైన వీడియోను చిత్రీకరించినందుకు ఓ గుర్తుతెలియని వ్యక్తిపై మరో కేసు కూడా నమోదైంది. 

గోవా సంస్కృతి,‌ చ‌పోలీ డ్యామ్ ప‌విత్ర‌త‌ను దెబ్బ తీసేలా ప్ర‌వ‌ర్తించినందుకే కేసు పెట్టామ‌ని గోవా ఫార్వ‌ర్డ్ మ‌హిళా విభాగం పేర్కొంది. ఫార్వర్డ్ పార్టీ ఫిర్యాదు మేరకు పూనమ్‌ను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

కాగా, గతంలో పూనమ్ పాండే తన భర్త సామ్ బాంబేపై దక్షిణ గోవాలోని కెనకోనా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిన విషయం తెలిసిందే. సామ్ అహ్మద్ తనపై దాడి చేసి, చెంపదెబ్బ కొట్టినట్లు పూనమ్ ఆరోపించింది. 

ఆ తర్వాత సామ్  బాంబే బెయిల్ పై విడుదలయ్యాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే పూన‌మ్‌ మ‌న‌సు మార్చుకొని భ‌ర్త‌తో క‌లిసిపోయి అంద‌రినీ ఆశ్చ‌ర్య పరిచింది.
 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !