మిషన్ 2024: ముచ్చటగా మూడోసారి పీకే- పవార్ భేటీ, థర్డ్ ఫ్రంట్ తప్పదా..?

By Siva KodatiFirst Published Jun 23, 2021, 4:39 PM IST
Highlights

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ల మధ్య వరుస భేటీలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా వీరు బుధవారం మరోసారి సమావేశమయ్యారు. గడిచిన 15 రోజుల వ్యవధిలో వీరిద్దరూ భేటీ కావడం ఇది మూడోసారి. 

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ల మధ్య వరుస భేటీలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా వీరు బుధవారం మరోసారి సమావేశమయ్యారు. గడిచిన 15 రోజుల వ్యవధిలో వీరిద్దరూ భేటీ కావడం ఇది మూడోసారి. పవార్ నివాసంలో ప్రతిపక్షనేతలు చర్చలు జరిపిన తర్వాతి రోజే వీరు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఉదయం పవార్ నివాసానికి చేరుకున్న పీకే.. గంట పాటు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.

Also Read:అది ధర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు సమావేశం కాదు: తేల్చేసిన ఎన్సీపీ

అయితే థర్డ్ ఫ్రంట్‌పైనే ఇద్దరూ మంతనాలు సాగించి వుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ నెల 11న శరద్ పవార్‌ను కలిశారు పీకే.. ఆ తర్వాత గత సోమవారం వీరిద్దరూ రెండోసారి  సమావేశమయ్యారు. నిన్న శరద్ పవార్ నివాసంలో ఎనిమిది మంది విపక్ష పార్టీలకు చెందిన నాయకులు సమావేశమై సమాలోచనలు జరిపారు. ఈ పరిస్ధితుల నేపథ్యంలో మిషన్ 2024 లక్ష్యంగానే భేటీలు జరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇది థర్డ్ ఫ్రంట్ కోసం కాదని.. కేవలం దేశ రాజకీయ వాతావరణాన్ని తెలుసుకోవడం కోసమేనని నేతలు చెబుతున్నారు. 

click me!