మెట్రో స్టేషన్ లో దారుణం.. యువతిపై లైంగిక వేధింపులు, ఫిర్యాదుకు స్పందించని పోలీసులు..!

Published : Jun 04, 2022, 09:20 AM IST
మెట్రో స్టేషన్ లో దారుణం.. యువతిపై లైంగిక వేధింపులు, ఫిర్యాదుకు స్పందించని పోలీసులు..!

సారాంశం

ఢిల్లీ మెట్రో స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది. అడ్రస్ నెపంతో ఓ యువకుడు.. యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిమీద మొదట ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు.. చివరకి ట్వీట్ చేయడంతో.. 

ఢిల్లీ : ఎన్ని చర్యలు తీసుకున్నా… ఎంత రక్షణ కల్పిస్తున్నా.. ఎంత జాగ్రత్తగా ఉంటున్న యువతులు, మహిళలపై దేశంలో Sexual harassment కొనసాగుతూనే ఉన్నాయి. బస్సుల్లో.. రైళ్ళలో ప్రయాణం చేసే సమయంలో కొందరు ఆకతాయిలు Womanలను లైంగికంగా వేధిస్తూ.. Metro stationలో ఓ యువతికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఓ యువకుడు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు.  ఈ దారుణ ఘటన దేశ రాజధాని Delhiలో చోటు చేసుకుంది.

వివరాల ప్రకారం.. బాధిత యువతి ఢిల్లీలోని jor bagh metro స్టేషన్ లో రైలు ఎక్కింది. ఆ తర్వాత రైలులో ఉన్న ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి.. ఓ అడ్రస్ గురించి అడిగాడు. ఈ క్రమంలో ఆమె అతడికి అడ్రస్ చెప్పింది. ఆ తర్వాత ఆమె దిగి పోవాల్సిన స్టేషన్ రాగా... రైలు దిగి మరో రైలు కోసం ఎదురు చూస్తూ ఫ్లాట్ఫామ్ మీద ఉన్న బెంచ్ మీద కూర్చుంది. ఇంతలో అడ్రస్ అడిగిన వ్యక్తి మళ్లీ ఆమె వద్దకు వచ్చి మరోసారి అడ్రస్ క్లియర్గా చెప్పమని అడిగాడు.

ఈ క్రమంలో సదరు వ్యక్తి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తన శారీరక అవయవాలను ఆమెకు తాగిస్తూ.. దారుణంగా వ్యవహరించాడు. దీంతో బాధితురాలు అతను ఏం చేస్తున్నాడో గమనించి.. ప్లాట్ఫామ్ మీద ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది కి ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పింది అతను పట్టించుకోకుండా పై ఫ్లోర్ లో ఉన్న స్టేషన్లో ఫిర్యాదు చేయమన్నాడు. దీనితో షాక్ కు గురైన యువతి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని కూడా గుర్తించింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకునేందుకు నిరాకరించారు. దానిని పెద్ద సీన్ చేయవద్దని ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

దీంతో బాధితురాలు తనకు జరిగిన చేదు అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కు ఫిర్యాదు చేసింది. ఆమె ట్వీట్ కు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు.  ఘటనపై తగు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తిస్తున్నట్లు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ఇక, ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది... కేసును సుమోటోగా స్వీకరించిన్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. 

 

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు