కూతురు లాంటి కోడలిపై పోలీస్ మామ అత్యాచారం..!

Published : Jun 28, 2021, 08:08 AM IST
కూతురు లాంటి కోడలిపై పోలీస్ మామ అత్యాచారం..!

సారాంశం

ఇటీవల మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మామ నజీర్.. కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ ఆమెను బెదిరించడం గమనార్హం.  

కూతురు లాంటి కోడలిపై ఓ మామ కన్నేశాడు. కొడుకు భార్యను గౌరవంగా చూడాల్సిందిపోయి దారుణానికి పాల్పడ్డాడు. అతను ఓ గౌరవమైన, బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ... ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ లోని రిజర్వ్ ప్రోవిన్షియల్ ఆర్మ్ డ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఓ మహిళకు పెళ్లైంది. ఆమె మామ గారు కూడా పోలీసు అధికారి కావడం గమనార్హం. కాగా.. ఇటీవల మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మామ నజీర్.. కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ ఆమెను బెదిరించడం గమనార్హం.

అయితే తనపై జరిగిన దారుణం గురించి  భర్త అబిద్‌కు చెప్పింది. దీంతో తన భార్య చెప్పేది పూర్తిగా వినకుండానే ట్రిపుల్ తలాఖ్ ఇచ్చేశాడు. దీంతో ఆమె మీరట్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది.  నిందితుడు నజీర్‌పైనా, బాధితురాలి భర్త అబీద్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా అబీద్‌తో మూడేళ్ల క్రితం బాధితురాలుకి వివాహమైంది. కోడలిగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టి నాటి నుంచీ అత్తింటివారు తనను అదనపు కట్నం కోసం వేధించేవారిని ఆమె  ఫిర్యాదులో పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం