హిందూ దేవుళ్లను కించపరిచిన అమెజాన్... పోలీసు కేసు

By telugu teamFirst Published May 18, 2019, 9:14 AM IST
Highlights

హిందూ దేవుళ్లను కించపరిచినందుకు గాను... ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ  అమెజాన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం నోయిడాలో పోలీసులకు అమెజాన్ పై కేసు ఫైల్ చేశారు. 

హిందూ దేవుళ్లను కించపరిచినందుకు గాను... ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ  అమెజాన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం నోయిడాలో పోలీసులకు అమెజాన్ పై కేసు ఫైల్ చేశారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... అమెజాన్ లో అన్ని రకాల వస్తువులు కోనుగోలు చేస్తారన్న విషయం మనకు తెలిసిందే. కాగా... అమెజాన్ అమెరికా వెబ్ సైట్ లో హిందూ దేవుళ్లను కించపరిచారు. దుప్పట్లు, బాత్రూమ్ టాయ్ లెట్ సీట్లపై దేవుడి ఫోటోలు ప్రింట్ చేశారు. కాగా.. వీటిని చూసిన కొందరు వినియోగదారులు అమెజాన్ పై మండిపడ్డారు.

‘బాయ్ కాట్’ అమేజాన్ పేరిట చిన్నపాటి ఉద్యమం కూడా నడిపారు. అక్కడితో ఆగకుండా.. దీనిపై నోయిడాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. దీనిపై అమెజాన్ అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. కష్టమర్లు అభ్యంతరం తెలిసిన ప్రొడక్ట్స్ ని ఇప్పటికే తమ వెబ్ సైట్ నుంచి తొలగించినట్లు స్పష్టం చేశారు. 

హిందూ దేవుళ్లను కించపరచడం అమెజాన్ కి ఇదేమీ తొలిసారేమీ కాదు. గతంలో కూడా ఈవిధంగానే చేసింది. చెప్పుల మీద, టాయ్ లెట్ లపై దేవుడు ఫోటోలను ఫ్రింట్ చేశారు. కాగా... అప్పుడు కూడా వివాదం కావడంతో.. వాటిని తొలగించారు. తాజాగా మళ్లీ అదే ఘటన పునరావృతం అయ్యింది.

click me!