భార్యకు భర్త కన్యత్వ పరీక్ష.. పెళ్లైన మరుసటి రోజే..!

Published : Jul 07, 2021, 02:27 PM IST
భార్యకు భర్త కన్యత్వ పరీక్ష.. పెళ్లైన మరుసటి రోజే..!

సారాంశం

మొదటి రాత్రి రోజే భర్త, అత్త, ఆడపడుచు ఆమెకు కన్వత్వ పరీక్షలు నిర్వహించారు. కొద్ది రోజుల అనంతరం కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టారు.

ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన కొత్త కోడలికి నిరాశ ఎదురైంది. ప్రేమగా చూసుకుంటాడుకున్న భర్త ఆమెకు నరకం చూపించాడు. పెళ్లైన మరసటి రోజునే ఆమెకు కన్యత్వ పరీక్ష చేయించాడు. అత్త, ఆడపడుచు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. దీంతో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. మధ్యప్రదేశ్‌లోని దబ్రాలో ఈ ఘటన జరిగింది.

గ్వాలియర్‌లోని దబ్రా ప్రాంతానికి చెందిన రాణి, అదే ప్రాంతానికి చెందిన హిమాన్షును గతేడాది మార్చిలో వివాహం చేసుకుంది. మొదటి రాత్రి రోజే భర్త, అత్త, ఆడపడుచు ఆమెకు కన్వత్వ పరీక్షలు నిర్వహించారు. కొద్ది రోజుల అనంతరం కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టారు. నల్లగా ఉన్నా సరే కోడలిగా చేసుకున్నామని, 20 లక్షల రూపాయల కట్నం తీసుకురావాలని అడిగేవారు. అయినా రాణి తమ వారికి ఈ విషయాలేం చెప్పుకుండా అత్తింట్లోనే గడిపింది. కొన్ని రోజుల తర్వాత పుట్టింటికి వెళ్లింది. కొద్ది రోజుల తర్వాత తిరిగి మళ్లీ అత్తింటికి వచ్చేటప్పటికీ తాళం వేసి ఉంది. 

దీంతో రాణి తండ్రి.. హిమాన్షుకు ఫోన్ చేయగా.. 20 లక్షల రూపాయల కట్నం ఇస్తేనే ఇంట్లోకి రానిస్తామని చెప్పాడు. ఎంత బతిమాలినా వారు అంగీకరించలేదు. దీంతో రాణి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హిమాన్షు కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu