ఉద్యోగం ఇప్పిస్తామంటూ యువతకు టోకరా.. మహిళ అరెస్ట్

By telugu news teamFirst Published Nov 26, 2020, 12:13 PM IST
Highlights

ఒక మహిళ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనను మోసం చేసిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. విశాఖ అనే ఆ మహిళ ఢిల్లీ ప్రభుత్వ విభాగానికి సంబంధించిన ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, తన ఐడెంటికీ కార్డు చూపించి, తనను ప్రలోభానికి గురిచేసిందని పేర్కొన్నాడు. 

లాక్ డౌన్ సమయంలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఓ మహిళ యువతకు టోకరా  ఇచ్చిన ఓ మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మహిళ ఉద్యోగాలప్పిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ. 13 వేల చొప్పున వసూలు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మదన్‌పూర్ ఖాదర్‌లో ఉంటున్న విజయ్ అనే వ్యక్తి సరితా విహార్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడు. 

ఒక మహిళ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనను మోసం చేసిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. విశాఖ అనే ఆ మహిళ ఢిల్లీ ప్రభుత్వ విభాగానికి సంబంధించిన ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, తన ఐడెంటికీ కార్డు చూపించి, తనను ప్రలోభానికి గురిచేసిందని పేర్కొన్నాడు. ఎస్డీఎంలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి తన ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ తీసుకున్నారని, అలాగే రూ. 13 వేలు ఆమె ఖాతాలో జమ చేయాలని కోరడంతో తాను అలానే చేశానని తెలిపారు. విజయ్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ మహిళను పట్టుకున్నారు. ఆమె దగ్గర నుంచి 11 నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను ఆరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

click me!