క్వారంటైన్ కేంద్రంలో యువతి స్నానం చేస్తుండగా...

Published : May 22, 2020, 07:16 AM IST
క్వారంటైన్ కేంద్రంలో యువతి స్నానం చేస్తుండగా...

సారాంశం

దమో జిల్లాకు చెందిన యువతి ఇండోర్‌ నుంచి తిరిగివస్తూ సాగర్‌ జిల్లాలోని కుమార్‌ భటోలి గ్రామంలోని ఓ పాఠశాలలో క్వారంటైన్‌లో ఉంచారు.

ఓ వైపు కరోనా వైరస్ వచ్చి జనాలు చస్తున్నా.. కొంత మందికి మాత్రం బుద్ధి రావడం లేదు. కరోనా వచ్చిందనే అనుమానంతో క్వారంటైన్ లో ఉన్న యువతిని కూడా కామాంధులు వదలడం లేదు. ఆమెను లైంగికంగా వేధిస్తూ నరకం చూపించారు. కాగా.. సదరు కామాంధులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దమో జిల్లాకు చెందిన యువతి ఇండోర్‌ నుంచి తిరిగివస్తూ సాగర్‌ జిల్లాలోని కుమార్‌ భటోలి గ్రామంలోని ఓ పాఠశాలలో క్వారంటైన్‌లో ఉంచారు. కాగా బాధిత యువతి క్వారంటైన్‌ కేంద్రం వెలుపల బాత్‌రూంలో స్నానం చేస్తుండగా నిందితులు వీడియో తీసి, ఆ క్లిప్‌ను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామని బెదిరించడం మొదలు పెట్టారు.

తమ కోరిక తీర్చకుంటే వీడియో సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేపట్టామని నిందితులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?
Best Mileage Cars : బైక్ కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే.. రూ.30 వేల శాలరీతో కూడా మెయింటేన్ చేయవచ్చు