బెదిరించి.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం

Published : Sep 16, 2020, 08:42 AM ISTUpdated : Sep 16, 2020, 08:45 AM IST
బెదిరించి.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం

సారాంశం

తనను సమీర్‌గా పరిచయం చేసుకుని, తన బలహీనతలను ఆసరాగా బ్లాక్‌మెయిల్ చేస్తూ రెండేళ్లుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.

ఓ మైనర్ బాలికపై వ్యాపారవేత్త రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. కాగా.. మైనర్ బాలికతోపాటు.. మరికొందరు మహిళలను కూడా ఇదే విధంగా బెదిరించడం గమనార్హం. కాగా.. ఆ కామాంధుడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్  రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో వెలుగు చూసిందీ ఘటన. సాత్నా జిల్లా ఎస్పీ రియాజ్ ఇక్బాల్ తెలిపిన దాని ప్రకారం.. బాధితురాలు సెప్టెంబర్ 11వ తేదీన కోల్వగాన్ పోలీసులను ఆశ్రయించి తనపై జరుగుతున్న అత్యాచార ఉదంతాన్ని వెల్లడించిందని అన్నారు. తనను సమీర్‌గా పరిచయం చేసుకుని, తన బలహీనతలను ఆసరాగా బ్లాక్‌మెయిల్ చేస్తూ రెండేళ్లుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.

‘‘సమీర్ అలియాస్ అతీక్.. రెండు పేర్లతో పాటు రెండు పాస్‌పోర్టులు కూడా ఉన్నాయి. 2017లో మతాంతర వివాహం చేసుకున్నాడు. అయితే కొద్ది రోజులకే విడాకులు తీసుకున్నాడు. అనంతరం ఆడవారితో సంబంధాలు ఏర్పరుచుకుంటూ వారిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. బ్లాక్‌మెయిల్ చేస్తూ వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నాడు’’ అని ఎస్పీ రియాజ్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu