PM Modi AP Tour: ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. జనవరి 16న శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు తగు ఏర్పాటు చేస్తున్నారు.
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. జనవరి 16న శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నారు. అక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్( National Academy of Customs, Indirect Taxes and Narcotics) ను సందర్శించనున్నారు. ఆ భవనం మొదటి అంతస్తులో గల యాంటీక్యూస్ (Antiques) స్మగ్లింగ్ స్టడీ సెంటర్ ను, నార్కోటిక్స్ స్టడీ సెంటర్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని సందర్శిస్తారు.
పర్యటన షెడ్యూల్ ఇదే….
ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా జనవరి 16న సత్యసాయి జిల్లాలోని పాలసముద్రానికి చేరుకుంటారు. అక్కడ గల నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ సెంటర్ ను సందర్శిస్తారు. వాటిలో కొనసాగుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత ప్రధాని మోదీ గ్రౌండ్ ఫ్లోర్ లోని ఎక్స్- రే,బ్యాగేజ్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సందర్శిస్తారు.
తదుపరి ఎకాడమీ బ్లాకు వద్ద రుద్రాక్ష మొక్కలను నాటి అక్కడ కనస్ట్రక్సన్ కార్మికులతో మాట్లాడుతారు. అనంతరం 74, 75వ బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతో మాటామంతీలో పాల్గొంటారు. అనంతరం పబ్లిక్ ఫంక్షన్‌లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం పూర్తయిన అనంతరం ఢిల్లీకి ప్రయాణమవుతారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్‌నజీర్, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఏర్పాట్లను సమీక్షించారు. కార్యక్రమానికి సంబంధించిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. .