అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అనిల్ కుమార్ అనే కళాకారుడు తన టాలెంట్ తోనే భక్తిని చాటుకున్నాడు. ఏకంగా 14 వేల దీపాలతో రామయ్య చిత్రపటాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు.
అయోధ్య : ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల (జనవరి) 22న దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశంలోని రాజకీయ, వ్యాపార, సినిమా రంగాల ప్రముఖులంతా ఈ 'ప్రాణప్రతిష్ట' వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో భక్తులను కట్టిపడేసేలా, ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా లక్షలాది దీపాలతో రామయ్య చిత్రాన్ని గీసాడో కళాకారుడు.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అనిల్ కుమార్ అనే కళాకారుడు తన టాలెంట్ తోనే భక్తిని చాటుకున్నాడు. అయోధ్యలోని సాకేత్ మహావిద్యాలయంలో దాదాపు 14 లక్షల దీపాలతో రామయ్య చిత్రపటాన్ని రూపొందించాడు అనిల్ కుమార్. ఇలా ధేధీప్యమానంగా వెలిగిపోతున్న కోదండరామయ్య ను చూసి భక్తులు పారవశ్యానికి గురవుతున్నారు.
వీడియో
అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం దగ్గరకు వస్తున్నా కొద్దీ భక్తుల్లో ఉత్సాహం పొంగి పొర్లుతోంది. ఇటీవల అయోధ్య విమానాశ్రయంలో ఆసక్తికర సన్నివేశం దర్శనమిచ్చింది. అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు చేరుకున్న మొదటి ఇండిగో విమానంలో సీతా సమేత శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి వేషధారణలో కొందరు భక్తులు ప్రయాణించారు. వీరిని చూసి విమాన ప్రయాణికులతో పాటు ఎయిర్ పోర్టులోని ప్రయాణికులు శ్రీరామ నామస్మరణ చేసారు. విమానాశ్రయంలో దేవతల వేషధారణలో వున్న ప్రయాణీకుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
ఇక అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తర ప్రదేశ్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. అయోధ్యలో మొత్తం 10వేల సిసి కెమెరాలను ఏర్పాటుచేయడమే కాదు డ్రోన్స్ ద్వారా పరిస్థితిని పరిశీలిస్తామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. అయోధ్యలో సెక్యూరిటీ కోసం అత్యాధునిక సాంకేతికత కలిగిన పరికరాలను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.