రైతుల ఆందోళన: ప్రతిపక్షాలకు చెక్.. రంగంలోకి మోడీ, యూపీలో భారీ కార్యక్రమం

By Siva KodatiFirst Published Dec 20, 2020, 2:51 PM IST
Highlights

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న వేళ వాటిని చల్లార్చేందుకు రంగంలోకి దిగారు ప్రధాని నరేంద్రమోడీ. రైతులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు సిద్దమయ్యారు మోడీ. 

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న వేళ వాటిని చల్లార్చేందుకు రంగంలోకి దిగారు ప్రధాని నరేంద్రమోడీ. రైతులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు సిద్దమయ్యారు మోడీ.

మాజీ ప్రధాని వాజ్‌పేయ్ జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 25న ప్రధాని మోడీ రైతులతో ముచ్చటించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 2,500 పైగా ప్రాంతాల్లో కిసాన్ సంవాదక్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

రైతులతో ప్రధాని మోడీ భేటీ కానుండటంతో యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్, పార్టీ నేత రాధామోహన్ సింగ్ కార్యకర్తలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేలా బీజేపీ ప్లాన్ వేసింది.

మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తోన్న ఆందోళనలు 25వ రోజుకు చేరాయి. రోజురోజుకు అన్నదాత ఉద్యమం ఉధృతమవుతోంది. నవంబర్‌ 26న రైతుల ఆందోళన మొదలైంది.

రైతు ఉద్యమం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 33 మంది రైతులు చనిపోయారు. చలి, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలతోపాటు పలు కారణాలతో వీరంతా చనిపోయారని రైతు సంఘాలు వెల్లడించాయి.

click me!