మరోసారి సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

By Siva KodatiFirst Published Apr 22, 2020, 7:29 PM IST
Highlights

దేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫ్‌రెన్స్ నిర్వహించనున్నారు

దేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫ్‌రెన్స్ నిర్వహించనున్నారు.

ఈ నెల 27న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీఎంలతో జరిగే ఈ కాన్ఫరెన్స్‌లో లాక్‌డౌన్ అమలు, కరోనా కేసులు, నివారణ చర్యలు తదితర అంశాలపై చర్చించనున్నారు.

అలాగే లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రాల ఆర్ధిక పరిస్ధితులు, లాక్‌డౌన్ సడలింపులు వంటి అంశాలపైనా  ప్రధాని.. సీఎంల అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉంది. మరవైపు భారత్‌లో బుధవారం నాటికి కరోనా సోకిన వారి సంఖ్య 20 వేలు దాటింది.

ఈ రోజు సాయంత్రం 5 గంటల దేశంలో 20,471 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 3,960 మంది డిశ్చార్జి కాగా.. 652 మంది మృత్యువాత పడ్డారు.

దేశంలోనే అత్యథికంగా ఆ రాష్ట్రంలో 5,221 మందికి కరోనా సోకగా, 251 మరణాలు నమోదయ్యాయి. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారవిలో కొత్తగా మరో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ముంబై మున్సిపల్ కార్పోరేషన్ వెల్లడించింది. 
 

click me!