సెకండ్ వేవ్ ప్రకంపనలు: అధికారులతో మోడీ అత్యవసర సమావేశం

By Siva KodatiFirst Published Apr 17, 2021, 8:32 PM IST
Highlights

వివిధ రాష్ట్రాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు.  దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తదితర అంశాలపై చర్చించనున్నారు. రెండు రోజుల్లో మోడీ నిర్వహిస్తున్న రెండో సమావేశం కావడం గమనార్హం.

శుక్రవారం కూడా అధికారులతో ప్రధాని సమావేశమయ్యారు. దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ లభ్యతపై అధికారులతో సమీక్షించారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా... ఎప్పటికప్పుడు డిమాండ్‌కు అనుగుణంగా మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు ఉత్పత్తిని పెంచాలని ఆయన సూచించారు.  

Also Read:ఆక్సిజన్‌కు కటకట.. కేంద్రంపై రాష్ట్రాల ఒత్తిడి: మోడీ అత్యవసర సమావేశం

ముఖ్యంగా బెడ్లు, ఆక్సిజన్ , వ్యాక్సిన్, రెమ్‌డెసివర్ ఇంజెక్షన్‌ల కొరత ఆసుపత్రులను వేధిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ లభ్యత, సరఫరాపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమీక్ష నిర్వహించారు.

వైద్య, ఉక్కు, రవాణా శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ పలు కీలక సూచనలు చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సమన్వయంతో వ్యవహరించడం ఎంతో ముఖ్యమన్నారు.

వైరస్ తీవ్రత అధికంగా ఉన్న 12 రాష్ట్రాలైన- మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, యూపీ, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌లో ఆక్సిజన్‌ సరఫరాపై ఆరా తీసినట్టు పీఎంవో అధికారులు ప్రధానికి వివరించారు. ఈ క్రమంలో వచ్చే 15 రోజుల వరకు ఆక్సిజన్‌ లభ్యత, వినియోగం గురించి ప్రధాని సమీక్షించారు. 
 
click me!