మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ.. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నవారికి పరామర్శ

Published : Nov 01, 2022, 04:59 PM ISTUpdated : Nov 01, 2022, 05:01 PM IST
మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ.. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నవారికి పరామర్శ

సారాంశం

గుజరాత్‌లోని మోర్బీలో మచ్చూ నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా కేబుల్ బ్రిడ్జి ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ మంగళవారం పరిశీలించారు.

గుజరాత్‌లో మోర్బీలో మచ్చూ నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా కేబుల్ బ్రిడ్జి ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ మంగళవారం పరిశీలించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో కలిసి ప్రధాని మోదీ ఘటన స్థలాన్ని సందర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేబుల్ బ్రిడ్జి ప్రమాదం అనంతరం రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్‌లో పాల్గొన్న వ్యక్తులను ప్రధాని మోదీ కలిశారు. వారితో కాసేపు మాట్లాడారు. 

అలాగే.. ఈ ప్రమాదంలో ఘటనలో గాయపడిన వారిని పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో కలిసి మోర్బీలోని సివిల్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ బాధితులతో మాట్లాడిన ప్రధాని మోదీ వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక, బ్రిడ్జి కూలిన ఘటనా స్థలాన్ని పరిశీలించి, సివిల్ హాస్పిటల్‌లో క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ.. మోర్బీలోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఇక, మోర్బీ వంతెన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రోజున గాంధీనగర్‌లోని  రాజ్  భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ  ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు సహయంతో  పాటు క్షతగాత్రులు త్వరగా కోలుకునేలా మెరుగైన చికిత్స అందేలా చూడాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మోర్బీలో ప్రమాదం గురించిన వివరాలను అధికారులు మోదీకి తెలిపారు. ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్స్ తీరుతెన్నులను కూడా  వివరించారు. బాధితులకు  అన్ని విధాలా సహాయం అందించాలని ప్రధాని ఆదేశించారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?