నన్ను ముక్కలుముక్కలుగా చెయ్యాలనుకుంటున్నారు: ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published May 9, 2019, 8:17 AM IST
Highlights

తనను ముక్కలు ముక్కలుగా చేయాలనుకుంటున్న వారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. బీజేపీ యేతర పక్షాలన్నీ మహాకల్తీ కూటమిలంటూ ధ్వజమెత్తారు. రామాయణం, మహాభారతాలను తిట్టేవారు ఆ మహాకల్తీ కూటమిలో ఉన్నారంటూ విరుచుకుపడ్డారు. 
 

హర్యానా: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు తనను ముక్కలు ముక్కలు చేయాలనుకుంటున్నారంటూ పలు ఆరోపణలు చేశారు. 

తనను ముక్కలు ముక్కలుగా చేయాలనుకుంటున్న వారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. బీజేపీ యేతర పక్షాలన్నీ మహాకల్తీ కూటమిలంటూ ధ్వజమెత్తారు. రామాయణం, మహాభారతాలను తిట్టేవారు ఆ మహాకల్తీ కూటమిలో ఉన్నారంటూ విరుచుకుపడ్డారు. 

వారు పాకిస్తాన్‌ను ప్రేమిస్తారు కానీ భారతదేశ నిర్మాణానికి బాటలు వేసిన వారిని మాత్రం విస్మరిస్తారంటూ విమర్శించారు. భారత్‌ అభివృద్ది చెందితే ఈ ఘటన పాకిస్తాన్‌కు ఇస్తారు అని మోదీ అన్నారు. భారత వింగ్ కమాండర్ అభినందర్ వర్థమాన్ విషయంపై మోదీ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 

పాకిస్తాన్‌ నుంచి మనల్ని మనం ఆత్మరక్షణ చేసుకునే సమయంలో ఓ ఆఫీసర్ దొరికాడు. అతను 48 గంటల్లో స్వదేశానికి వచ్చాడు. ఈ విషయంలో భారత దౌత్యాన్ని అభినందించాల్సింది పోయి ఇమ్రాన్ ఖాన్‌కు నోబెల్ ప్రైజ్ ఇద్దామంటున్నారు అంటూ మోదీ విరుచుకుపడ్డారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రేమ అనే ముసుగు ధరించి, ద్వేషాన్ని ప్రచారం చేస్తోందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తనను చాలా తిడుతున్నారన్న మోదీ కొందరు హిట్లర్ అంటే మరికొందరు ఇతరుల జీవితాలతో ఆడుకునేవాడు అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. 

తననే కాదు తన తల్లిని కూడా దూషించారంటూ గుర్తు చేశారు. తన తండ్రి ఎవరని అడిగారు. తాను ప్రధాని అయిన తర్వాతే ఇవన్నీ ప్రశ్నిస్తున్నారని అదీ కాంగ్రెస్ వాళ్లు చూపే ప్రమే అంటూ మోదీ ధ్వజమెత్తారు. 

వాళ్లు ప్రేమ గురించి మాట్లాడతారాని కానీ తనను ముక్కలు ముక్కలు చేయాలనుకుంటారు అలాంటి వారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందంటూ ప్రధాని నరేంద్రమోదీ విరుచుకుపడ్డారు. మోదీ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. 
 

click me!