అహ్మదాబాద్‌లో తల్లి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకన్న ప్రధాని మోదీ..

By Sumanth KanukulaFirst Published Dec 28, 2022, 4:38 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్య సమస్యలతో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌ చేరిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి బయలుదేరి.. యూఎన్ మోహతా ఆస్పత్రికి చేరుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్య సమస్యలతో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌ చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హీరాబెన్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని యూఎన్ మెహతా ఆస్పత్రి హెల్త్ బులిటెన విడుదల చేసింది. తన తల్లి అనారోగ్యానికి గురైందన విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ.. అహ్మదాబాద్‌ బయలుదేరారు. కాసేపటి క్రితం మోదీ తన తల్లి చికిత్స పొందుతున్న అహ్మదాబాద్‌లోని యూఎన్ మోహతా ఆస్పత్రికి చేరుకున్నారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు కొందరు బీజేపీ ముఖ్య నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆస్పత్రి వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. 
    
ఇక, ప్రధాని మోదీ తన తల్లిని ఈ నెల ప్రారంభంలో.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడుత పోలింగ్‌కు ఒక రోజు ముందు కలిశారు. హీరాబెన్ వీల్‌ చైర్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును కూడా వినియోగించుకన్నారు. ఇక, 1923 జూన్ 18న జన్మించిన హీరాబెన్ మోదీ.. ఈ ఏడాది 100వ ఏటా అడుగుపెట్టారు. హీరాబెన్ 100వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది జూన్ 18న మోదీ ఆమెను కలిశారు. తల్లి నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ ఓ పోస్టు కూడా చేశారు. 

click me!