మహాత్మాగాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ

Published : Aug 15, 2018, 08:14 AM ISTUpdated : Sep 09, 2018, 11:36 AM IST
మహాత్మాగాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ

సారాంశం

నరేంద్రమోదీ ఢిల్లీలోని రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్ముడికి శిరసు వంచి నివాళులు అర్పించారు.

72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో ఘనంగా ప్రారంభయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ముందుగా జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.

బుధవారం ఉదయం నరేంద్రమోదీ ఢిల్లీలోని రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్ముడికి శిరసు వంచి నివాళులు అర్పించారు. అనంతరం స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనేందుకు ఎర్రకోటకు వచ్చారు. ఎర్రకోట వేడుకల్లో పాల్గొనేందుకు మాజీ ప్రధానమంత్రులు మన్ మోహన్ సింగ్, హెచ్ డి దేవెగౌడ, కేంద్రమంత్రి జేపీ నడ్డా, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కె అద్వానీలు తరలివచ్చారు. ఎర్రకోట వద్ద పదివేల మంది సాయుధ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీ నగరంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 70వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.

PREV
click me!

Recommended Stories

Top 10 Banks : ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ ఏదో తెలుసా..? ఇన్ని లక్షల కోట్లా..!
Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ