దేశ అభివృద్దికి ప్రధాని మోదీ కొత్త మంత్రం.. పౌరులు తీసుకోవాల్సిన ఐదు ప్రతిజ్ఞలు ఇవే..

By Sumanth KanukulaFirst Published Aug 15, 2022, 8:57 AM IST
Highlights

భారత  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. ప్రధాని హోదాలో మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించడం ఇది తొమ్మిదో సారి. 

భారత  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. ప్రధాని హోదాలో మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించడం ఇది తొమ్మిదో సారి. అనంతరం చారిత్రక ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. అమృతకాలంలో పంచప్రాణ్ సంకల్పాన్ని ప్రతిపాదించారు.  2047 నాటికి భారతదేశం కోసం స్వాతంత్ర్య సమరయోధుల కలలను నెరవేర్చేందుకు పౌరులు తీసుకోవాల్సిన ఐదు ప్రతిజ్ఞలను (పంచప్రాణ‌్) పేర్కొన్నారు. 

ప్రధాని మోదీ చేసిన 5 తీర్మానాలు ఇలా ఉన్నాయి.. 
1. వికసిత భారతం..
25 ఏళ్లలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి. నేను యువతను రాబోయే 25 సంవత్సరాల జీవితాన్ని దేశాభివృద్ధికి అంకితం చేయాలని కోరుతున్నాను. మేము మొత్తం మానవాళి అభివృద్ధికి కృషి చేస్తాము

2. బానిసత్వ నిర్మూలన.. మనం ఇతరులలాగా మారడానికి ప్రయత్నించకూడదు. మన ఆలోచనలో బానిసత్వం అనే జాడ ఉండకూడదు. కొన్నిసార్లు మన ప్రతిభకు భాషా అవరోధాలు అడ్డుగా ఉంటాయని.. అందుకే మన దేశంలోని ప్రతి భాష గురించి గర్వపడాల్సిన అవసరం ఉంది

3. వారసత్వం.. మన వారసత్వం గురించి మనం గర్వపడాలి. మన మూలాలకు మనం కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మనం ఎత్తుకు ఎదగగలం. మనం ఎత్తుకు ఎగిరినప్పుడు మనం మొత్తం ప్రపంచానికి పరిష్కారాలను అందిస్తాం.

4. ఏకత్వం.. జాతి అభ్యున్నతికి పాటుపడేందుకు మనం ప్రజలుగా ఐక్యంగా ఉండాలి. భారతదేశ ప్రగతికి సమానత్వం మూలస్తంభం. “ముందు భారతదేశం” అనే మంత్రం ద్వారా మనం ఐక్యంగా ఉన్నామని నిర్ధారించుకోవాలి.

5. పౌరుల బాధ్యత.. ఐదవ ప్రతిజ్ఞ పౌరుల కర్తవ్యం. విద్యుత్తు, నీటిని పొదుపు చేయడం ప్రజల కర్తవ్యం. దీనిని అనుసరిస్తే.. మనం అనుకున్న ఫలితాలను ముందుగానే చేరుకోగలము. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులతో సహా ఈ విధులు భారతదేశంలోని పౌరులందరికీ వర్తిస్తాయని ఆయన అన్నారు. 

click me!