PM Modi: పోరాడండి.. విజ‌యం సాధించండి.. యువ‌త‌కు ప్ర‌ధాని మోడీ పిలుపు

By Rajesh KFirst Published Jan 12, 2022, 2:15 PM IST
Highlights

PM Modi:  భారత‌దేశానికి యువతే బలమ‌ని, ఆ యువ‌త‌నే మ‌న దేశాభివృద్దికి కీల‌కమ‌ని ప్రధాని నరేంద్ర మోడీ  అన్నారు. వారికి 2022 ఎంతో కీలకమన్నారు. యువత వల్లే డిజిటల్ పేమెంట్స్​లో భారత్​ దూసుకుపోతోందని ప్ర‌ధాని ప్ర‌శంసించారు. 

PM Modi: భారత‌దేశానికి యువతే బలమ‌ని, ఆ యువ‌త‌నే మ‌న దేశాభివృద్దికి కీల‌కమ‌ని ప్రధాని నరేంద్ర మోడీ  అన్నారు. పుదుచ్చేరిలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల(ఎంఎస్​ఎంఈ) సాంకేతిక కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశానికి అప‌ర‌మైన శ‌క్తులున్నాయ‌నీ, అవి..యువ‌త, ప్రజాస్వామ్యం అని చెప్పారు. భార‌త దేశ అభివృద్దిలో యువత కీల‌క ప్రాత పోషిస్తోంద‌ని, వారు అభివృద్ధి ఛోదకులను పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌పంచ‌దేశాలు సైతం అంగీక‌రించాయ‌ని తెలిపారు.

ఆత్మనిర్భర్ భారత్‌లో MSME పాత్ర చాలా కీలకమైనదిగా పేర్కొన్నారు. ఇక, ప్రపంచాన్ని మార్చే సాంకేతికతను ఎంఎస్ఎంఈ రంగంలో ఉపయోగించడం సంతోషంగా ఉందన్న ఆయన.. ఆ దిశగా కీలక ముందడుగు వేసేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. వీటి ద్వారా  సంవత్సరానికి 6,400 మంది ట్రైనీలకు శిక్షణ ఇవ్వగలదని తెలిపారు. ఈ క్ర‌మంలో  పాటు పుదుచ్చేరి ప్రభుత్వం నిర్మించిన ‘పెరుంతలైవర్ కామరాజర్ మణిమండపం’ ఆడిటోరియంను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.  
 
ఇక, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వివేకానందున్ని స్మరించుకుంటూ.. భారత దేశానికి యువతే బలం… 2022 వారికి చాలా కీలకం కానుందన్నారు. యువత ఆవిష‌ర్క‌ణ‌ల వ‌ల్ల‌..  దేశంలో డిజిటల్​పేమెంట్స్ పెరిగాయని.. మ‌న దేశ యువత అన్ని తరాలకు యువత ఆదర్శంగా నిలిస్తుందన్నప్రధాని  మోడీ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ తరుణంలో పోరాడండి.. విజ‌యం సాధించండి అనే నినాదాన్ని నిచ్చారు. యువత శక్తి భారతదేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంద‌ని ప్ర‌ధాని అన్నారు.

15-18ఏళ్ల వారికి వ్యాక్సినేషన్​ ప్రారంభమైనప్పటి నుంచి భారీ స్పందన లభిస్తోందని అన్నారు ప్ర‌ధాని.  ఇప్పటివరకు 2కోట్లకుపైగా పిల్లలు టీకా తీసుకున్నారనీ, మహిళల కనీస వివాహ వయస్సు 21 ఏళ్ల పెంచింది కూడా ఆడ పిల్ల‌ల జీవితంలో మ‌రిన్ని అవకాశాలు కల్పించేందుకేన‌ని తెలిపారు.  ప్రస్తుతం భారత్​లో 50వేల స్టార్ట‌ప్ సంస్థలకు అనువైన వాతావరణం ఉందని ప్ర‌ధాని తెలిపారు. కొవిడ్ కష్టకాలంలో కఠిన సవాళ్లు ఎదురైనప్పటికీ గత ఆరేడు నెలల్లోనే 10వేల స్టార్ట‌ప్ సంస్థలు పుట్టుకొచ్చినట్లు ప్ర‌ధాని తెలిపారు.  

click me!