బీజేపీ పాలిత రాష్ట్రాల 'సీఎంలతో మోడీ భేటీ: 2024 ఎన్నికలపై వ్యూహారచన

Published : May 28, 2023, 05:12 PM IST
బీజేపీ పాలిత  రాష్ట్రాల  'సీఎంలతో  మోడీ భేటీ: 2024  ఎన్నికలపై  వ్యూహారచన

సారాంశం

వచ్చే ఏడాదిలో  జరిగే  పార్లమెంట్  ఎన్నికల్లో  అనుసరించాల్సిన   వ్యూహంపై  బీజేపీ  పాలిత  రాష్ట్రాల సీఎంలతో  మోడీ  ఇవాళ  భేటీ అయ్యారు. 


న్యూఢిల్లీ: బీజేపీ పాలిత  రాష్ట్రాల ముఖ్యమంత్రులతో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఆదివారంనాడు న్యూఢిల్లీలో  భేటీ అయ్యారు. ఆయా  రాష్ట్రాల్లో అమలౌతున్న  అభివృద్ది   పథకాల గురించి సీఎంలు  ప్రధాని మోడీకి వివరించారు. 2024  పార్లమెంట్  ఎన్నికల గురించి    ప్రధాని మోడీతో  ఆయా రాష్ట్రాల సీఎంలు  చర్చించారు.  ఈ ఎన్నికల్లో  ఆయా  రాష్ట్రాల్లో  అనుసరించాల్సిన  వ్యూహాంపై  వ్యూహాంపై    నేతలకు  ప్రధాని దిశా నిర్ధేశం  చేశారు.

బీజేపీ  జాతీయ  అధ్యక్షుడు జేపీ నడ్డా,  కేంద్ర మంత్రి  అమిత్ షా, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్,. గోవా సీఎం ప్రమోద్ సావంత్ , హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్,  అసోం సీఎం  హిమంత  బిశ్వాస్ , ఉత్తర్ ప్రదేశ్  సీఎం  యోగి  ఆదిత్యనాథ్ ,ఉత్తరాఖండ్  సీఎం  పుష్కర్ సింగ్  ధామి,గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్, నాగాలాండ్  డిప్యూటీ సీఎం  యత్రుంగో ,  మధ్యప్రదేశ్  సీఎం శివరాజ్ సింగ్  చౌహాన్త్రిపుర సీఎం మాణిక్ సాహా  తదితరులు  ఈ సమావేశంలో  పాల్గొన్నారు. న్యూఢిల్లీలో  కొత్త పార్లమెంట్  భవనం ప్రారంభించిన  తర్వాత  ఈ సమావేశం జరిగింది. 

2024  పార్లమెంట్  ఎన్నికలకు  మరో ఏడాది సమయం ఉంది.   వచ్చే పార్లమెంట్  ఎన్నికల్లో  విజయం సాధించి మూడో దఫా  విజయం సాధించాలని  బీజేపీ  పట్టుదలగా  ఉంది.  ఆయా రాష్ట్రాల్లో  ప్రత్యర్ధుల బలాలు, బలహీనతలపై  ఈ సమావేశంలో  చర్చించనున్నారు.  ఏ వ్యూహాంతో  ముందుకు వెళ్తే  ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉందనే విషయమై   చర్చించనున్నారు. మరో వైపు  ప్రధాని మోడీ  9 ఏళ్లలో  చేపట్టిన  అభివృద్ది   కార్యక్రమాలను  ప్రజల్లోకి తీసుకెళ్లే విషయమై   సీఎంలతో  చర్చించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Vijay First Independence Day | సీఎం హోదాలో తొలిసారి జెండా ఎగరేసిన విజయ్| FlagHoisting | TamilNadu
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం విజయ్ స్పీచ్ కి త్రిష ఫిదా | CM Vijay Independence Day Speech