నన్నేమీ అనలేక.. మా అమ్మను తిడుతున్నారు.. మోదీ

Published : Nov 24, 2018, 04:11 PM IST
నన్నేమీ అనలేక.. మా అమ్మను తిడుతున్నారు.. మోదీ

సారాంశం

తననేమీ అనలేక.. వాళ్ల అమ్మపై కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 

తననేమీ అనలేక.. వాళ్ల అమ్మపై కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్.. రూపాయి విలువను ప్రధాని మోదీ తల్లితో పోల్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కామెంట్లపై తాజాగా మోదీ స్పందించారు.

మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్‌ నేతలకు సమస్యలపై మాట్లాడే సత్తా లేక ఇతరుల తల్లులపై అసభ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వారి మాటలు చూస్తుంటే మోదీని ఢీకొట్టలేని నిస్సహాయతలో ఉ‍న్నట్లు అర్ధమవుతుందన్నారు. కానీ తాను మాత్రం గత 17 ఏళ్లుగా కాంగ్రెస్‌కు గట్టి పోటీనిస్తూ.. ఓడిస్తున్నాననీ తెలిపారు. 

పోలింగ్‌ తేది సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్‌ నేతలకు భయం పట్టుకుందని, వారి డిపాజిట్లు గల్లంతు కావద్దనే మోదీ తల్లిని తిడుతున్నారని వ్యాఖ్యానించారు. తమ పార్టీకి ప్రజలే హైకమాండ్‌ అని, మాది రిమోట్‌ ప్రభుత్వం కాదని, ప్రజా ప్రభుత్వమని పరోక్షంగా కాంగ్రెస్‌ నేతలకు చురకలంటించారు.
 

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?