
PM Modi: గ్రీస్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత గౌరవం దక్కింది. గ్రీస్ అధ్యక్షురాలు కటారినా ఎన్ సకెల్లారోపౌలౌ ప్రధాని మోదీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ (The Grand Cross of the Order of Honour)ను ప్రదానం చేశారు. ప్రధాని మోదీ ఒకరోజు పర్యటన నిమిత్తం గ్రీస్ చేరుకున్నారు. చంద్రయాన్-3 విజయం భారత్‌కే కాదు.. యావత్ మానవాళికి దక్కిన విజయం అని గ్రీస్ అధ్యక్షురాలు కటారినా ఎన్ సకెల్లారోపౌలౌతో ప్రధాని మోదీ అన్నారు.
అంతకుముందు.. చంద్రయాన్ మిషన్ విజయవంతం కావడంపై గ్రీస్ అధ్యక్షుడు ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3 మిషన్ ద్వారా సేకరించిన డేటా యొక్క ఫలితాలు మొత్తం శాస్త్రీయ సౌభ్రాతృత్వానికి, మానవాళికి సహాయపడతాయని మోడీ అన్నారు. చంద్రయాన్-3 విజయం భారత్‌కు మాత్రమే కాదు, యావత్ మానవాళికి దక్కిన విజయమని అన్నారు.
అంతకుముందు.. భారత ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సమావేశాలు ముగిసిన అనంతరం నేడు గ్రీస్ కు వెళ్లారు. ఈ తరుణంలో గ్రీస్ రాజధాని ఏథెన్స్ లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. ప్లకార్డులు చేతపట్టుకుని భారత సంతతి పౌరులు విమానాశ్రయం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వందేమాతరం నినాదాలతో అక్కడి ప్రాంతం మారుమోగింది. గ్రీస్ ప్రధాని కిరియకోస్ మిట్సోటాకిస్ ఆహ్వానంపై మోదీ గ్రీస్ పర్యటనకు వెళ్లారు. గత 40 ఏళ్లలో భారత ప్రధాని గ్రీస్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. అనంతరం ఓ వేడుకలో ఆయనకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు.
గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ గ్రీస్ చేరుకున్నారు. దీంతో ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా నుండి గ్రీస్ రాజధాని ఏథెన్స్ చేరుకున్నాడు. దక్షిణాఫ్రికాలో ప్రధాని 15వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యాడు. వారి దేశాలతో భారతదేశ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి పలువురు ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.