
BR Ambedkar grand show: సంఘ సంస్కర్త, భారత రాజ్యాంగ పితామహుడు బీఆర్ అంబేద్కర్ జీవితంపై రూపొందించిన నాటకాన్నిఫిబ్రవరి 25 నుంచి మార్చి 12 వరకు జేఎల్‌ఎన్ స్టేడియంలో ప్రదర్శిస్తామని ఢిల్లీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం తెలిపారు. ఈ నాటకాన్ని జనవరి 5 నుండి ప్రదర్శించాల్సి ఉంది.అయితే దేశ రాజధానిలో COVID-19 కేసుల పెరుగుదల కారణంగా ఈ నాటక ప్రదర్శనలను వాయిదా వేశారు. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రతిరోజూ రెండు షోలను నిర్వహిస్తామనీ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ నాటకాన్ని పూర్తిగా ఉచితం తిలకించవచ్చునని ఆయన తెలిపారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేశంలోని గొప్ప నాయకులలో ఒకరనీ, ఆయన జీవితం స్ఫూర్తిధాయకమని అన్నారు.ఆయనకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, అభిమానులు ఉన్నారనీ, తాను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ భక్తుడనీ, అతనిని ఆరాధిస్తానని తెలిపారు. అంబేద్కర్ జీవితాంతం పోరాడి పేదలకు, దళితులకు న్యాయం జరిగేలా పోరాడారని, ఆయన పేద కుటుంబం నుండి వచ్చి న్యాయ మంత్రి అయ్యాడని కేజ్రీవాల్ వివరించారు.
గతేదాడి డిసెంబర్‌లో మహాపర్నిర్వాణ దివాస్ సందర్భంగా.. బాబా సాహెబ్ జీవితం ఆధారంగా నాటకాన్ని రూపొందించి, ప్రదర్శనను నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా.. ఢిల్లీ ప్రజలు ఆయన జీవితం నుండి ప్రేరణ పొందారని, ఈ నాటక ప్రదర్శనను జనవరి 5 నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. కానీ, ఒమిక్రాన్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది ఇప్పుడు ఫిబ్రవరి 25 నుండి మార్చి 12 వరకు ప్రదర్శించాలని నిర్ణయించారు.
బహుశా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంపై రూపొందించిన ఈ నాటకం ప్రపంచంలోనే గొప్ప ప్రదర్శన అవుతుంది. ప్రతిరోజూ రెండు సార్లు ఈ నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఈ నాటకాన్ని పూర్తిగా ఉచితం వీక్షించవచ్చు. కానీ, సీట్లు పరిమితం ఉండటం వల్ల ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ షో ను తిలకించడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు సీఎం కేజ్రీవాల్. బాబాసాహెబ్ నాటకంలో అంబేద్కర్ పాత్రలో ప్రముఖ టీవీ నటుడు రోనిత్ బోస్ రాయ్ నటించనున్నారు.