తొలిరాత్రి రోజు భార్యను బెడ్ పై వదిలేసి..

Published : Feb 11, 2021, 08:17 AM IST
తొలిరాత్రి రోజు భార్యను బెడ్ పై వదిలేసి..

సారాంశం

ఫొటో చూస్తుంటే ఎంతకీ అతడు రాలేదనే నిర్వేదంతో చూస్తూ కూర్చుండిపోయినట్టు కనిపిస్తోంది. ఈ ఫొటోలపై కామెంట్స్‌, షేర్లు ట్రెండవుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఫన్నీ కామెంట్స్‌ వస్తున్నాయి.   

ప్రతి ఒక్కరి జీవితంలో తొలి రాత్రి అనేది తీయని అనుభూతిని కలిగిస్తుంది. అలాంటి రోజు దాదాపు ఏ అబ్బాయి అయినా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తాడు. ఎప్పుడెప్పుడు ఆ అవకాశం వస్తుందా అని ఎదరుచూస్తారు. తీరా అలాంటి రోజు వచ్చాక ఓ పెళ్లి కొడుకు.. భార్యను వదిలేసి.. కంప్యూటర్ కి అత్తుకుపోయాడు. ఇది ఎక్కడ జరిగింది అనేది ఐడియా లేదు గానీ.. ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

కొత్తగా పెళ్లయిన దంపతులు పెళ్లి బట్టలతోనే అందంగా అలంకరించిన శోభనం గదిలోకి వెళ్లారు. అయితే భార్య బెడ్‌పై కూర్చుని ఉండగా భర్త కంప్యూటర్‌ ముందు వాలిపోయాడు. ఫొటో చూస్తుంటే ఎంతకీ అతడు రాలేదనే నిర్వేదంతో చూస్తూ కూర్చుండిపోయినట్టు కనిపిస్తోంది. ఈ ఫొటోలపై కామెంట్స్‌, షేర్లు ట్రెండవుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఫన్నీ కామెంట్స్‌ వస్తున్నాయి. 

ఆ ఫొటోను చూసినవారంతా ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ప్రభావం’ అని ఒకరు, ‘ఉండమ్మ హిస్టరీ డిలీట్‌ చేయని’ అని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఆ వధూవరులు ఎక్కడివారో తెలియదు కానీ దానికి సంబంధించిన ఫొటో మాత్రం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆన్‌లైన్‌ క్లాస్‌ల ప్రభావం.. అందుకే టీచర్‌ శోభనం రోజు కూడా కంప్యూటర్‌లో బోధన చేస్తున్నాడని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. మా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల పరిస్థితికి అద్దం పడుతోందని మరో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తమ బాధను వెళ్లబోసుకున్నాడు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌