
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్రమోడీ మధ్య బుధవారం ఫోన్ సంభాషణ జరిగింది. పుతిన్ పుట్టినరోజును పురస్కరించుకుని మోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పుతిన్‌తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని, స్నేహాన్ని ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్‌ను పెంపొందించడంలో పుతిన్ వ్యక్తిగతంగా కీలకపాత్ర పోషించారని మోడీ ప్రశంసించారు.
కరోనా మహమ్మారితో సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో పరస్పరం సహకరించుకోవాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ప్రజారోగ్య పరిస్ధితి సాధారణ స్థితికి చేరిన తర్వాత భారతదేశంలో మీకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ఆసక్తి వ్యక్తం చేశారు.