కూతుర్ని చంపి.. మెడను వేరుచేసి.. పరువుకోసం తండ్రి, అన్న కిరాతకం..

Bukka Sumabala   | Asianet News
Published : Oct 07, 2020, 03:01 PM IST
కూతుర్ని చంపి.. మెడను వేరుచేసి.. పరువుకోసం తండ్రి, అన్న కిరాతకం..

సారాంశం

ఉత్తర్ ప్రదేశ్ లో రోజురోజుకూ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. హాథ్రాస్ ఘటన ఇంకా చల్లారకముందే రోజుకో దారుణం వెలుగుచూస్తోంది. తాజాగా గర్భవతి అయిన 16 ఏళ్ల దళిత బాలిక పరువు హత్య కలకలం రేపింది. షహజన్‌పూర్‌ జిల్లాలో బాలికను స్వయంగా ఆమె తండ్రి, సోదరుడు కిరాతకంగా హత్య చేశారు. 

సెప్టెంబర్ 23న బాలిక అదృశ్యమయింది. అప్పటి నుండి ఆమె ఆచూకీ తెలియలేదు. అయితే మంగళవారం ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కాగా కుటుంబ సభ్యులు ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. పోస్టుమార్టంలో బాలికను బాలికను తీవ్రంగా హింసించి గొంతు కోసి చంపినట్టు తేలింది. 

దీనిమీద విచారణ జరుపగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బాలిక తీరుతో కుటుంబం పరువు మంటగలిసిందనే ఆక్రోశంతోనే  తండ్రి, సోదరుడు దారుణంగా కొట్టి చంపారు. ఆ తరువాత బాలిక తలను శరీరం నుంచి వేరుచేసి నది ఒడ్డున ఖననం చేశారని పోలీసులు తెలిపారు. కాగా బాలిక తండ్రి నేరాన్ని అంగీకరించగా సోదరుడు పరారీలో ఉన్నాడు. బాలిక గర్భం దాల్చడంతో ప్రజలు తనను అవమానిస్తున్నారని, ఈ ఆక్రోశంతోనే కన్నబిడ్డను చంపుకున్నానని తండ్రి తన నేరాన్ని అంగీకరించాడు. 

బాలిక సోదరుడు పరారీలో ఉన్నాడని ఇద్దరిపై హత్యా నేరం మోపి దర్యాప్తు చేపట్టామని షహజన్‌పూర్‌ ఎస్‌ఎస్పీ ఎస్‌.ఆనంద్‌ వెల్లడించారు. బాలిక హత్యలో తల్లి, ఇతర బంధువుల ప్రమేయం ఉందేమోనన్న దిశగా దర్యాప్తు చేశామని అదేం లేదని తెలిందని తెలిపారు. 

కాగా బాలిక ఎన్నడూ స్కూలుకు వెళ్లలేదని, ఓ బంధువు వద్ద ఉండేదని కుటుంబ సభ్యుల విచారణంలో తేలిందని పోలీసులు చెప్పారు. మైనర్‌ బాలికతో లైంగిక సంబంధాలు నేరమని దీనికి కారకులెవరైనా విడిచిపెట్టమని పోలీసులు పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families